తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే జాలేస్తుంది. తెలంగాణలో ఆ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చూసిన అదే జాలి కలుగుతోంది.

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే జాలేస్తుంది. తెలంగాణలో ఆ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చూసిన అదే జాలి కలుగుతోంది. మనకి జాలి కలుగుతోంది, వాళ్ళని చూస్తే, అటు ఆ ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ అధిష్టానానికి, పార్టీకి సంబంధించిన నాయకులకు మాత్రం వణుకు పుడుతోంది. ఓ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇంకో పార్టీలోకి వెళ్ళడం కొత్త ఏం కాదు, తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేలని చేర్చుకోవడం తప్పు అని తెలిసి కూడా, నైతికం కాదు అని తెలిసి కూడా, గతంలో బిఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, అలాగే బిహేవ్ చేస్తూ వస్తున్నాయి, ఆ విషయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మాత్రం, భారతీయ జనతా పార్టీ క్లీన్ చీట్ ఇవ్వచ్చు,

మనం ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 62 స్థానాలతో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత, తెలంగాణలో మొదటి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్ర జరుగుతుంది అనే అనుమానంతో, ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని, చాలా పెద్ద ఎత్తున తమ పార్టీలో చేర్చుకుంది బిఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంది, అంటూ శాసన సభ పక్షాలనే విలీనం చేసుకుంది. కమ్యూనిస్ట్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ శాసన సభ పక్షం, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన సభా పక్షం బిఆర్ఎస్ లో విలీనమయ్యాయి. సో మొదటిసారి అటువంటి పరిస్థితి ఉంది, విలీనం చేసుకున్నారు ,యక్సెప్టెన్సీ వచ్చింది ప్రజల నుంచి.

ఆ తర్వాత 88 స్థానాలతో రెండోసారి బిఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన సభా పక్షాన్ని విలీనం చేసుకుంది, దానిపైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని చేర్చుకొని, కాంగ్రెస్ పార్టీ ని ఒక బాధిత పార్టీగా మార్చింది, బాధిత పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ కూడా 10 మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని, తమ పార్టీలో చేర్చుకున్నారు. సో దేశమంతా రాహుల్ గాంధీ పార్టీ పిరాయింపులు తప్పు అని చెప్తున్నారు, రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతున్నారు, మీరేంటి ఇలా చేర్చుకున్నారు అని అడిగిన ప్రశ్నలకు, చాలా వ్యంగ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సమాధానం చెప్తూ వచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకున్న తర్వాత, ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మార్పు వాళ్ళు, మారిన సందర్భంగా నేరుగా ముఖ్యమంత్రి వెళ్లి కండువ కప్పడం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకపోవడం, వీటిని బేస్ చేసుకొని బిఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేసింది.

సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది, బిఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టు వెళ్లి చేసిన పోరాటం ప్రతిఫలం ఇచ్చేలా కనపడుతుంది. ఆ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుపడే వాతావరణం ధ్వనిస్తోంది. సుప్రీం కోర్ట్ నేరుగా శాసన సభ స్పీకర్ కి కొన్ని సూచనలు ఇచ్చింది, వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఇమ్మిడియట్ గా వాళ్ళ వర్షన్ తీసుకొని, దానిపై నిర్ణయం తీసుకోండి అని శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు ఉన్న ఆ చిన్న గ్యాప్ కారణంగా, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే అంశానికి సంబంధించి ఉన్న అంబిగ్ కారణంగా, కోర్టులు స్పీకర్ ని ఆదేశించజాలవు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. చాలా సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్లు పాటించిన పరిస్థితి కూడా లేదు, ఇక ఇప్పుడు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు, వాళ్ళ వివరణ తీసుకోబోతున్నారు, వివరణ తీసుకోబోతున్న నేపథ్యంలో తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, తూచ్‌ అంటున్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని తిరిగి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో కలిసి కార్యక్రమాలకు అటెండ్ అయ్యి, బిఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేసి, ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్తున్నారు. సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పడం చూసి, వాళ్ళకు ఎన్నికలు అంటే భయమేస్తోంది, పాపం కదా అని అనుకున్నాం. వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సందర్భంలో కూడా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ఇటీవలకు టీవీ9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అవును వాళ్ళందరూ మా పార్టీలో చేరితే తప్పేంటి, అంటూ ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉంది, వాళ్ళని చేర్చుకొని ధైర్యంగా నిలబడింది, ఎటువంటి భయం కాంగ్రెస్ పార్టీకి లేదు, వాళ్ళ తరపున కాంగ్రెస్ పార్టీ అండగా ఉండబోతుంది అని అనుకున్నాం ఆ స్టేట్మెంట్ తర్వాత, సడన్ గా రెండు రోజుల తర్వాత మహేష్ కుమార్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్, పెట్టి వాళ్ళు మా పార్టీలో చేరలేదు, మేము కప్పింది జాతీ జెండా కప్పాం, వాళ్ళకి వాళ్ళు ఎక్కడ పార్టీలో చేరారు, వాళ్ళు ఇంకా బిఆర్ఎస్ లోనే ఉన్నారు. చూడండి కావాలంటే మా ముఖ్యమంత్రిని ఇంకా ఎవరైనా కలుస్తారు, వేరే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కలిసారు అంటూ ఫోటో చూపిస్తున్నారు. అంటే ఎక్కడో భయం కనిపించింది.సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story