ఇండిగో వివాదంలో తెలుగుదేశం పార్టీ పరువు పోగొట్టుకుంది. తెలుగుదేశం పరువు దేశవ్యాప్తంగా గంగలో కలిసిపోయింది.

ఇండిగో వివాదంలో తెలుగుదేశం పార్టీ పరువు పోగొట్టుకుంది. తెలుగుదేశం పరువు దేశవ్యాప్తంగా గంగలో కలిసిపోయింది. తెలుగుదేశం పార్టీ పరువు పోగొట్టుకోవడానికి కారణం, తెలుగుదేశం పార్టీయే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఇండిగో సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సరిగ్గా అంచనా వేయలేకపోయింది. దాన్ని అరికట్టలేకపోయింది. ఆ కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు పడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అనేక కార్యక్రమాలని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు అంటూ దేశవ్యాప్తంగా పౌర విమానాయన శాఖ పైన వ్యతిరేకత రావడం చూస్తున్నాం.

పౌర విమానాయన శాఖ పైన వచ్చిన వ్యతిరేకత, రిపబ్లిక్ టీవీ చర్చ కేంద్రంగా పూర్తిగా తెలుగుదేశం పార్టీ పైనకి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు, నారా లోకేష్ వార్ రూమ్ పెట్టి మానిటర్ చేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ పరువును తీసేసాయి. నిజానికి ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇండిగో కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీళ్ళు ముగ్గురు పక్కన ముగ్గురు బాధ్యత వహించాల్సిన అంశంలో కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి రావడానికి, తెలుగుదేశం పార్టీ కారణమైంది. తమ నాయకత్వాన్ని పొగిడే క్రమంలో, సోయి లేకుండా పొగడ్తలకు పోయి, తెలుగుదేశం పార్టీ పరువుని బజార్‌కు ఈడ్చారు దీపక్ రెడ్డి. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story