Hidma Encounter: Many suspicions about the encounter..!

హిడ్మా ఎన్‌కౌంటర్‌ సంచలనం సృష్టించింది. హిడ్మా మావయిష్టుకు సంబంధించిన కీలకమైన నేతగా ఉన్నారు. హిడ్మా అనేక ఆపరేషన్స్ లో ఇప్పటికే పార్టిసిపేట్ చేశారు. ఆయన నేతృత్వంలో పోలీసులపైన, సిఆర్పిఎఫ్ జవాన్ల పైన గతంలో అనేక దాడులు జరిగాయి. అనేక రాష్ట్రాల్లో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆయనపైన పలు రివార్డులు కూడా ఉన్నాయి. అనేక కేసులు హిడ్మా పైన ఉన్నాయి. హిడ్మా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. పోలీసులకి. కేంద్ర బలగాలకు కూడా నవంబర్ 30 లోపు హిడ్మా హిడ్మాని లేకుండా చేస్తామంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిష్టుల నిర్మూలన కార్యక్రమాన్ని చేపడుతున్నామంటూ ఓపెన్ గానే కేంద్ర హోం శాఖ మంత్రి చెప్తూ వస్తున్నారు. మావోయిష్టుల నిర్మూలన పేరుతో చేపట్టిన ఆపరేషన్ కగార్లో వందల మంది మావోయిష్టులు కేవలం 2025 సంవత్సరంలోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూస్తున్నాం. అనేకమంది ఎన్‌కౌంటర్ల పేరుతో ప్రాణాలు కోల్పోతే, వందల మంది పోలీసులకు లొంగిపోవడం కూడా చూస్తున్నాం. మావోయిస్టు ఉద్యమం ప్రారంభం తర్వాత అనేకమంది కీలకమైన నాయకులు, అగ్రనాయకులు లొంగిపోయిన సంవత్సరంగా 2025 సంవత్సరాన్ని చూడొచ్చు. అయితే హిడ్మా అనుూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడిల్లి ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడం అనేది ఆశ్చర్యం కలిగించింది. ఆయన సహచరితో పాటు ఇక్కడ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఆయన మరణించిన తర్వాత విజయవాడ ప్రాంతంలో మరి కొంతమంది మావోయిష్టులు తలదాచుకున్నారు, వాళ్ళని రౌండ్ అప్ చేసి వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో భారీ కుట్రకు తెరలేపారు, ఆంధ్రప్రదేశ్ లో భారీ దాడులకు ప్లాన్ చేశారు కాబట్టి ఆ దానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు పసిగట్టి, ఈ ఎన్‌కౌంటర్‌ చేశారు, వాళ్ళని లొంగిపోమని పిలిచినప్పటికీ, లొంగిపోమని కోరినప్పటికీ వాళ్ళు ముందుకు రాలేదు కాబట్టి, ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది, ఇలాంటి మూడు దశాబ్దాలుగా వింటున్న మాటలే, ఇక్కడ కూడా విన్నాం. అయితే ఓ పక్క ఆయన శ్రీలంకకు వెళ్ళడం కోసం, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు, మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో భారీ దాడులకు సంబంధించి ఏర్పాట్లు చేశారు అనే అనే వార్తలు కూడా ప్రభుత్వం వైపు నుంచి లీకులుగా చూస్తున్నాం, అయితే మొత్తం వ్యవహారం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిడ్మా ఎన్‌కౌంటర్‌ ఆయన్ని పట్టుకొచ్చి కాల్చి చంపారా అనే అనుమానాలకు తావిస్తోంది. కాబట్టి మొత్తం వ్యవహారం పైన న్యాయ విచారణ జరపాలి అని కమ్యూనిస్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!

Updated On
ehatv

ehatv

Next Story