Karedu Grama Sabha : కరేడు గొంతు విప్పనిస్తారా?
కరేడు గ్రామం ఉంటుందా లేదా కరేడు గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్రపటం నుంచి తీసేసే కుట్ర జరుగుతోంది

కరేడు గ్రామం ఉంటుందా లేదా కరేడు గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్రపటం నుంచి తీసేసే కుట్ర జరుగుతోంది అంటూ ఇంతకుముందు నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన కరేడు అనే గ్రామాంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని 8300 ఎకరాలకు పైగా భూమిని ఇండోసూల్ అనే ఒక సోలార్ కంపెనీకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా 4000 ఎకరాలకు పైగా భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ మేరకు రేపు గ్రామసభ జరగబోతుంది. కరేడు గ్రామంలో. సో తమకు తమను సంప్రదించకుండా తమకు కనీస సమాచారం లేకుండా భూసేకరణకు సంబంధించిన నిబంధనలని పాటించకుండా సామాజిక సర్వే చేయకుండా, సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయకుండా, ఏ రకంగా భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారంటూ ఇప్పటికే కరేడు గ్రామస్థులు కరేడు గ్రామానికి సంబంధించిన ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు. 8000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాలనుకున్నారు. 4000 ఎకరాలకు పైగా భూములకు సంబంధించిన సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ అంశంపైన ఇప్పటికే కరేడు గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు.. వాళ్ళు చేస్తున్న ఆందోళనకు వామ పక్షాలు కొన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇస్తూ వచ్చాయి. ఇటీవల కొద్ది రోజుల క్రితం వాళ్ళు నేషనల్ హైవే దిగ్బంధనం పేరుతో ఆందోళన చేసే ప్రయత్నం చేస్తే వందలాది మంది పోలీసులతో ఆ గ్రామాన్ని నిర్బంధం చేసి ఎవరూ బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. వాళ్ళంతా వాళ్ళని తప్పించుకుని హైవే పైకి వచ్చి తమ నిరసనని వ్యక్తం చేశారు.
అప్పుడు నిరసనలో పార్టిసిపేట్ చేసిన రాజకీయ పార్టీల పైన పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా చూశాం.తాజాగా రేపు గ్రామసభ నిర్వహించబోతున్నారు. కరేడు గ్రామంలో రేపు నిర్వహించబోయే గ్రామసభ ఉద్రిక్తతకు దారి తీయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. మొత్తం గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో సోలార్ కంపెనీ రావడాన్ని ఆహ్వానించట్లేదు, స్వాగతించట్లేదు. మేము మీకు మద్దతుగా ఉన్నాం, మా భూమిని ఒక సెంట్ భూమిని మీకు ఇస్తామని ముందుకు వచ్చిన ఏ ఒక్క కుటుంబం కూడా లేదు.. అటువంటి నేపథ్యంలో అక్కడ ఇంకా గ్రామసభ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి ఎవరికి వాళ్ళు గ్రామసభ పెట్టడానికంటే ముందే బయటికి వచ్చి తమ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో రేపు ఫార్మల్ గా అక్కడ గ్రామసభ జరగబోతుంది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
