Home Ministry to Azharuddin? : అజారుద్దీన్‌కు హోంమంత్రి పదవి..?
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అజారుద్దీన్ గడిచిన శాసన సభ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు, ఓడిపోయిన వాళ్ళకు పదవులు ఇవ్వద్దు అనేది కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఓడిపోయిన చాలా మంది సీనియర్లు మంత్రి పదవి ఆశించినప్పటికీ, ఓడిపోయిన వాళ్ళకి పదవులు లేవు లాంటి నిబంధన కారణంగా వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు, ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌కి మాత్రం మంత్రి పదవి తక్కింది. అనూహ్యంగా జూబ్లీహిల్స్‌లో లక్షకు పైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు, మైనారిటీ ఓటర్లే జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని తేల్చబోతున్నారు.
మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేరు లాంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా, జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓట్లను సాధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేలా చేయొచ్చు అనేది, కాంగ్రెస్ పార్టీ రాజకీయ రాజకీయంగా వేసుకున్న స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ ప్రకారం అజారుద్దీన్‌కి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆయనకి స్థానం కల్పించిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిప్పుతున్నారు, ఇప్పుడు ఆయనకి అవకాశం కల్పించారు కాబట్టి, ఇప్పటి వరకు మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వలేదు లాంటి విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో మైనారిటీకి అవకాశం కల్పించాము అని చెప్పడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ ఆ విమర్శకు, ఆ విమర్శను తిప్పికొట్టడం, అలాగే మైనారిటీల ఓట్లని గ్రాబ్ చేయడం, మైనారిటీలని ఆకర్షించడం లక్ష్యంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు అజారుద్దీన్‌కు శాఖ కేటాయింపు అంశం వివాదంగా మారుతున్నట్లు కనపడుతుంది, సాధారణంగా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వాళ్ళు ఉదయం మంత్రివర్గ ప్రమాణం స్వీకారం చేస్తే, ఒక గంటలోనో, రెండు గంటలోనో శాఖల కేటాయింపు గతంలో చూశాం.
ఆ తర్వాత కనీసం సాయంత్రానికి మంత్రులకు శాఖల కేటాయింపు అనేది చూస్తూ ఉండేవాళ్ళం కానీ, అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులు గడిచినప్పటికీ, ఇప్పటివరకు ఆయనకు శాఖ కేటాయింపు జరగలేదు, ఆయనకు శాఖ కేటాయింపు జరగకపోవడం వెనక రీజన్ ఏంటి అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్న చర్చ ఏంటంట అంటే అజారుద్దీన్ తనకి హోమ్ శాఖ కావాలని పట్టుపడుతున్నారంట. గతంలో 10ఏళ్ల పాటు మహమూద్ అలీ మంత్రిగా పని చేశారు, మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఆయన రెవెన్యూ శాఖ నిర్వహించారు, తర్వాత హోమ్ శాఖను నిర్వహించారు, హోమ్ శాఖ లాంటి, రెవెన్యూ లాంటి కీలకమైన శాఖలని మైనారిటీలకు గత సర్కార్ ఇచ్చింది.ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


