ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన సందర్భంగా, వచ్చిన జనాలను చూసిన తర్వాత నర్సీపట్నం రోడ్డు మార్గంలో విశాఖపట్నం నుంచి ఆయన వెళ్తున్న సందర్భంగా

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన సందర్భంగా, వచ్చిన జనాలను చూసిన తర్వాత నర్సీపట్నం రోడ్డు మార్గంలో విశాఖపట్నం నుంచి ఆయన వెళ్తున్న సందర్భంగా, దారి పొడుగున జనాలు వచ్చి ఆయన కలుస్తున్న దృశ్యాలు చూసిన తర్వాత, చాలా పెద్ద ఎత్తున జనం ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్న దృశ్యాలు చూసిన తర్వాత, అది ఒక ర్యాలీ కాదు, ఎన్నికల ర్యాలీ కాదు, ఎవరు గ్యాదర్ చేసింది కాదు, అది ఒక 2 కిలోమీటర్లు జరిగింది కాదు, 60 కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణం చేస్తున్న దారిపొడుగున జనాలు. సో ఆ కాలేజీ సందర్శన సందర్భంగా అక్కడికి వచ్చిన జనాలు, ఇదంతా చూసిన వాళ్ళకు గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కంపేర్ చేసుకున్నప్పుడు, అలా ఎలా జరిగింది అనిపిస్తుంది.

ఈ స్థాయిలో జనాదరణ ఉన్న ఒక వ్యక్తి, ఈ స్థాయిలో ప్రజల్లో అభిమానం ఉన్న వ్యక్తి, ఈ స్థాయిలో ప్రజలు ఆయన చూసేందుకు ఎగబడుతున్న సందర్భంలో, 11 సీట్లకే ఎలా పరిమితమైపోయారు, అలా ఎలా జరిగింది, అలా ఎలా జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది, ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ప్రజల మద్దతు కోల్పోయిన పార్టీలు, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి రెండేళ్లో, మూడేళ్లో సమయం తీసుకుంటాయి. ఆ రెండేళ్ల, మూడేళ్ల కాలంలో అధికారంలో ఉన్న పార్టీలు చేసిన తప్పుల కారణంగా, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కారణంగా, ఓడిపోయిన పార్టీ మళ్ళీ ప్రజలకు దగ్గర అవ్వడానికి, ప్రజలు ఓడిపోయిన పార్టీ వైపు చూడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. 2019లో టీడిపి ఓడిపోయిన తర్వాత టిడిపి వైపు జనం చూడడానికి, టీడిపి గట్టిగా ఒక సభ పెట్టుకోవడానికి కూడా మూడు సంవత్సరాల సమయం పట్టింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళిన ప్రతి సందర్భంలో ఈ స్థాయిలో జనాలు రావడం, ఈ స్థాయిలో జనాలని ఆయన వెనకాల పరిగెత్తడం, పైగా ప్రభుత్వం 18 రకాల నిబంధనలు విధించి, జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అనుమతించిన నేపథ్యంలో, 10 వాహనాలు మినహా ఆయన కాన్వాయ్‌లో ఇంకెవరు ఉండకూడదని, ప్రభుత్వం, పోలీసులు చాలా పెద్ద ఎత్తున అక్కడ మొహరించి ఉన్న సందర్భంలో కూడా, వాటన్నిటిని పట్టించుకోకుండా, ఈ స్థాయిలో జనాలు, జగన్మోహన్ రెడ్డి వెంట రావడం చూసిన తర్వాత, ఎవరికైనా వస్తున్న సందేహం, 2024 ఎన్నికల ఫలితాలు అలా ఎందుకు వచ్చాయి, అని ఎవరికైనా వస్తున్న డౌట్, ఈ ఓట్లన్నీ ఏమైపోయాయి అని ఎవరికైనా వస్తున్న డౌట్, వీళ్లంతా ఓట్లు వేయకుండా ఎక్కడికి పోయారు. అని లేదా వీళ్లంతా వేసిన ఓట్లు ఏమైపోయాయి అని, ఎన్నికల సందర్భంలోనే ఇదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనాలు రావడం చూశాం.

అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ, మిగతా పార్టీలు చేసిన ఆరోపణ ఇదంతా గ్రాఫిక్స్ తో మాయ చేసేశారు అని. గ్రీన్ మ్యాట్లు వేసి జనాలు వచ్చినట్లు చూపించారు అని. అంతే కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరదాలు కట్టుకొని జనాల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి జనాల దగ్గరికి వెళ్ళాలంటే పరదాలు కట్టుకోవాల్సి వచ్చింది. పరదాలు లేకుండా జనాల దగ్గరికి వెళ్ళలేకపోయాడు అని రెండు రకాల ప్రచారాలని అప్పుడు, అప్పటి అధికార పార్టీ పైన తెలుగుదేశం పార్టీ చేసింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడ పరదాలు కట్టినట్టు కనపడట్లా, ఎక్కడ జనాలు గ్యాదర్ కి, వెహికిల్ గా పెట్టినట్టు కనిపించట్లా, ఎక్కడ గ్రీన్ మ్యాట్లు వేసే అవకాశం లేదు, మొత్తం పోలీసుల పర్యవేక్షణలోనే, మొత్తం రహదారి అంతా ఉంది. స్టిల్ జనాలు వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు ప్రభుత్వ నిబంధనలని, ప్రభుత్వ ఆంక్షల్ని తట్టుకొని, పోలీసుల ఆంక్షల్ని తట్టుకొని, పోలీసుల ఆంక్షలు పెట్టినా, పోలీసులు ఉదయం నుంచి రాత్రంతా చాలా చోట్ల హౌస్ అరెస్టులు చేశారు. కొంతమంది నాయకులని అరెస్ట్ చేశారు. రోడ్లపైన చెక్ పోస్టులు పెట్టారు. రెగ్యులర్ గా తిరుగుతున్న బస్సుల్ని, వాహనాల్ని ఆపి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్తున్నారా, ఇంకెక్కడికి వెళ్తున్నారా అని అడిగి మరీ, తనిఖీలు చేసి మరీ ఎక్కడికక్కడ ఆపేశారు. జనాలు ఎక్కడ నుంచి వస్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకే గతంలో 2024 ఎన్నికల ఫలితాల పైన అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా, పార్టీలకు సంబంధం లేని వాళ్ళకు కూడా న్యూట్రల్స్ కూడా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బయట నుంచి గమనిస్తున్న వాళ్ళకు కూడా అనిపిస్తోంది. అలా ఎలా జరిగింది అని. ఈ స్థాయి అభిమానం ప్రజల్లో ఉన్న వ్యక్తి, కేవలం 11 సీట్లకు ఎలా పరిమితమైపోయాడా లాంటి చర్చ మరోసారి జగన్మోహన్ రెడ్డి జనాల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా కనబడుతుంది.


Updated On
ehatv

ehatv

Next Story