ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేష్‌లో భారీ నిరసన ప్రదర్శనలు చేసింది.

ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేష్‌లో భారీ నిరసన ప్రదర్శనలు చేసింది. అన్ని నియోజక వర్గాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడిచిన రెండు నెలలుగా మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి పోరాటం చేస్తూ వస్తుంది. కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టింది. భారీగా సంతకాలు సేకరించింది. మెడికల్ కాలేజీని ప్రైవేట్ పద్ధతి, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం, పిపిపి పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా, వైద్య విద్య చదువుకుంటున్న విద్యార్థులకు నష్టం జరుగుతుంది. వైద్య విద్య చదువు చదవాలనుకునే విద్యార్థులు అటువంటి విద్యకు దూరమవుతారు చదువుకున్న వాళ్ళకు మాత్రమే విద్య దొరికే పరిస్థితి ఉంటుంది అలాగే పేదలకు వైద్యం దొరికే పరిస్థితి ఉండదు. 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని మీరు డెసిషన్ తీసుకుంటే, ఈ 17 మెడికల్ కాలేజీలో డబ్బులు ఇచ్చి వైద్యం చేపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, పేదవాళ్ళు వైద్యం కోసం వెళ్తే దోపిడికి గురవుతారు కాబట్టి, ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ వచ్చారు.

17 మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఏర్పాట్లు, భూములు సేకరణ టెండర్లు పిలవడం, ఒక ఐదు కాలేజీలు పూర్తవ్వడం, ఓ నాలుగైదు కాలేజీల్లో అడ్మిషన్స్, సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ కూడా కావడం, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత, ఇప్పుడు వీటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారంటే, దీని వెనక ప్రభుత్వానికి ఏదో దురుద్దేశం ఉంది, ఎవరికో లాభం చేయడం కోసం ఇది చేస్తున్నారు లాంటి విమర్శలు కూడా చేస్తూ వస్తుంది. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బుద్ధిజీవులు, ఆంధ్రప్రదేశ్లో పేదల ఆరోగ్యం పట్ల కన్సర్న్ ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలు వైద్య విద్యను అభ్యసించాలని కోరుకునే వాళ్ళు, నాట్ ఓన్లీ పేద ప్రజలు ఆంధ్రప్రదేశ్లో, ఓబిసి కి సంబంధించిన వాళ్ళు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కి సంబంధించిన వాళ్ళు కూడా, వైద్య విద్యకు దూరమయ్యేలా ప్రస్తుతం పిపిపి పాలసీ ఉంది, కాబట్టి దీనిపైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ వచ్చారు. చాలా వేదిక మీద ఈ నేపథ్యంలో జరిగిన ర్యాలీ జరిగిన నిరసన కార్యక్రమాలు చూసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి రావడం కనిపించింది.

నిజానికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం అనేది పెద్దగా గ్రౌండ్ లెవెల్లో, క్షేత్ర స్థాయిలో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ఎక్కే విషయం కాదు, కాస్త అర్బన్లో, చదువుకున్న వాళ్ళలో ఎడ్యుకేటర్స్ లో, కాస్త విద్యార్థుల్లో మాత్రమే దీనికి సంబంధించిన అవగాహన ఉంటుంది. వాళ్ళకు మాత్రమే దీని వల్ల జరిగే నష్టం ఏంటో తెలుస్తుంది కానీ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నియోజక వర్గాల్లో కూడా వేల సంఖ్యలో జనాలు రోడ్డుఎక్కారు. వేల సంఖ్యలో జనాలు రోడ్డుఎక్కి ఆందోళన చేయడం చూశాం. అనంతపురం సింగనమల లాంటి నియోజక వర్గాలలో వేల సంఖ్యలో జనాలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దు అంటూ ఆందోళన చేయడం చూశాం. రాష్ట్రంలో అనేక నియోజక వర్గాలకు సంబంధించిన వీడియోస్ కూడా వేల సంఖ్యలో, ఏ నియోజక వర్గంలోనూ కనీసం నాలుగు నుంచి 5 వేల వరకు తక్కువగా జనాలు బయటిక వచ్చి వచ్చిన సందర్భం కనపడలేదు. మెడికల్ కాలేజీల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకి ఇది కారణమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బల ప్రదర్శనలకు వేదిక అయిందా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దారుణమైన ఓటమిని చవి చూసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న బహుశా మొదటి కార్యక్రమంగా దీన్ని చూడొచ్చు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని మొత్తం శ్రేణులన్నీ బయటికివచ్చి ఆందోళన చేయడం కనిపించింది. అసలు అంత స్పందన ఎందుకు వచ్చిందనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story