కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తోంది. బ్యాంకుల జాతీకరణ అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయాల్లో ఒకటిగా భారతదేశానికి సంబంధించిన ప్రముఖులు, ఎకనామిస్టులు కీర్తిస్తూ ఉంటారు. అటువంటి నిర్ణయాన్ని రివర్స్ చేసే ప్రయత్నం కేంద్రంలోని మోదీ సర్కార్ చేయబోతుంది. బ్యాంకులన్నిటిని ప్రభుత్వ రంగంలో ఉన్న, ప్రభుత్వ పరం చేసిన బ్యాంకులన్నిటిని, తిరిగి ప్రైవేట ప్రైవేటీకరణ చేసే ఆలోచన, ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అటువంటి ఆలోచన కేవలం బయట నుంచి మనం స్మెల్‌ చేసి చెప్పడం కాదు, నేరుగా ఆర్థిక శాఖ మంత్రి ఎక్స్ప్రెస్ చేశారు. చేసే ఆలోచన ఉన్నట్టుగా కాబట్టి, అది సరైంది కాదు అంటూ మాట్లాడుకున్నాం. ఎందుకు అది మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే గడిచిన 10 ఏళ్ల కాలంలో, ఆ మాటకి వస్తే అంతకు ముందు నుంచి కూడా 90స్ నుంచి కూడా ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వాలు వెళ్తున్నాయి. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ప్రభుత్వాలు ఉన్నది వ్యాపారం చేయడానికి కాదు, ప్రభుత్వాలు ఉన్నది కేవలం కోఆర్డినేట్ చేయడానికి, సర్వీసెస్ ఇవ్వడానికి మాత్రమే, రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుకొని, అవి లాభాల్లో ఉన్నాయా నష్టాల్లో ఉన్నాయా, చూసుకుంటూ వాటి నష్టాలను కూడా భరిస్తూ, ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తాయి. ప్రభుత్వాలు వ్యాపారం చేయడానికి లేవు అనే మాట నేరుగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ మాట్లాడడం కూడా చూశాం.

విశాఖ స్టీల్ లాంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్థల్ని నష్టాలు వస్తున్నాయి అనే పేరుతో అమ్మేస్తూ వచ్చారు. ఆ తర్వాత నష్టాల్లోకి తీసుకెళ్లి బలవంతంగా కూడా అమ్మేస్తూ వచ్చారు, అమ్మే క్రమంలో తమ అనుకున్న వాళ్ళకు ఇచ్చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు, ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అన్నిటిని ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేస్తుంది. ప్రైవేట్ వాళ్లకు ధారాదత్తం చేస్తుంది.ప్రభుత్వ ఆస్తుల్ని తమ వారికి కట్టబెడుతుంది ఇలాంటి విమర్శలని ఫేస్‌ చేస్తుంది. ఈ విమర్శలు కూడా ఎల్ఐసి విషయంలో కూడా వచ్చాయి.ఈ దేశంలో ప్రజలు మారుమూల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా బలంగా నమ్మేది ఎల్ఐసిని. ఎల్ఐసి అంటే ఒక భద్రతకి భరోసాగా భావిస్తుంటారు, అటువంటి ఎల్ఐసి కి సంబంధించిన ఆస్తులు అదానికి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అదానికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ గా ఎల్ఐసి ఆస్తులని పెట్టారు అంటూ వార్తలు కూడా రావడం చూశాం. ఇప్పుడు ఎల్ఐసిపైన కూడా కన్నుబడింది, ఎల్ఐసి ని కూడా ప్రైవేట్ ఎల్ఐసిలో కొంత పర్సెంటేజ్ ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత అసలు పూర్తిగా ఎల్ఐసి ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఎల్ఐసి ని అమ్మేసే ప్రయత్నం, కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంటూ వార్తలు చాలా రోజులుగా చూస్తున్నాం. కేంద్రం కన్ను ఎల్ఐసి పైన కేంద్రం కన్ను, పోర్టులపైన కేంద్రం కన్ను, రైల్వేస్ పైన ఇలా అన్ని రంగాలని ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తుంది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story