CM Chandrababu : జవహర్‌లాల్ నెహ్రూ కంటే నరేంద్రమోదీనే గొప్పోడు.. మీకేం తెలుసు..!
టిడిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిన చూస్తే ఈయన చంద్రబాబు నాయుడేనా అనిపిస్తుంది.

టిడిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిన చూస్తే ఈయన చంద్రబాబు నాయుడేనా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడిన మాటల్ని గమనించినప్పుడు ఆ మాటలు ఈయనే మాట్లాడారా అనిపిస్తుంది, లేదా ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలు ఈయనవేనా అనిపిస్తుంది. ఏంటి అంత ఆశ్చర్యపోయే అంశం అంటే భారతీయ జనతా పార్టీని ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం, ఆయన పడుతున్న కష్టం చూస్తే బాధ అనిపిస్తుంది. జాలి అనిపిస్తుంది, ఆయన ఈయనేనా అనిపిస్తుంది, ఎవరు ఆయన, ఎవరు ఈయన అంటే, ప్రస్తుత చంద్రబాబుని గతంలో మనం ఎప్పుడూ చూడలే, ప్రస్తుత చంద్రబాబు తరహా మాటలు గతంలో ఎప్పుడూ చూడలే, చంద్రబాబు నాయుడు, గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.
ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. సో చంద్రబాబు గతంలో మూడోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న సందర్భంగా నరేంద్ర మోదీతో కలిసి ఎన్డీడిఏ తో కలిసి ఎన్నికలకు వెళ్ళారు, ఆ తర్వాత ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు, ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఎంత మర్చిపోదాం అన్నా మర్చిపోలేకపోతున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా, ఏంటి ఆ మాటలు నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఒక పిశాచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఒక విలన్ అంటూ మాట్లాడారు. నరేంద్ర మోడీ మొత్తం, దేశంలో ఒక నియంతృత్వానికి కేర్ ఆఫ్ అడ్రెస్ అంటూ మాట్లాడారు, ఇటువంటి నియంతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దేశం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది అన్నారు.
ఎవరు నరేంద్రమోదీ, నేను లోకేష్ కు తండ్రిని, దేవాన్ష్‌కు తాతని, నరేంద్ర మోదీ ఎవరు అంటూ మాట్లాడారు. నరేంద్ర మోదీ భార్య గురించి మాట్లాడారు, నేను ఈ దేశంలో అత్యంత సీనియర్ పొలిటీషియన్ని, 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను, 2000 తర్వాత నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయ్యారు, నేను ఇంత సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ, నా ఈగోని చంపుకొని, నా ఆత్మగౌరవాన్ని చంపుకొని, నరేంద్ర మోదీని అనేకసార్లు కలిసి, రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా గురించి, రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి అడిగాను, అయినా పట్టించుకోలేదు అని చెప్పారు. సో అంత సీనియర్ పొలిటీషియన్, నాలుగుసార్లు ముఖ్యమంత్రి, నరేంద్ర మోదీ కంటే ముందు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఈగోను చంపుకొని ఏడుఎనిమిద ఏళ్ల క్రితమే, నరేంద్ర మోడీని కలవడానికి ఈగోని చంపుకున్న వ్యక్తి, ఇప్పుడు నరేంద్ర మోడీ దేశ సంపద అంటున్నారు, ఈ జాతికి నరేంద్ర మోడీ అద్భుతమైన అవకాశం, నరేంద్ర మోడీ రూపంలో దొరికింది అని చెప్తున్నారు. ప్రధాని మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కంటే కూడా, నరేంద్ర మోడీ చాలా గొప్పవాడు అని చెప్తున్నారు. ఆ మాటకు వస్తే ప్రధాని నరేంద్ర మోదీయే ప్రజాస్వామ్యవాది, జవహర్‌లాల్ నెహ్రూయే నియంత అని చెప్తున్నారు. చంద్రబాబు పొగడ్తలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
