MLA MahipalReddy: బీఆర్‌ఎస్‌లో చేరి తప్పు చేశా..! రేవంత్‌కు తీవ్ర అవమానం కాదా..?
MLA MahipalReddy: బీఆర్‌ఎస్‌లో చేరి తప్పు చేశా..! రేవంత్‌కు తీవ్ర అవమానం కాదా..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బొటాబోటి మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు, బిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరడం అంటే వాళ్ళకి వాళ్ళుగా కండవాలు కప్పుకోలేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న రేవంత్ రెడ్డి, కొంతమంది ఇంటికి వెళ్లి, కొంతమందిని ఇంటికి పిలిచి కండువా కప్పారు. ఆయన స్వయంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. ఆయన కండువా కప్పిన తర్వాత ఆ ఎమ్మెల్యే లంతా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కంటిన్యూస్ గా పార్టిసిపేట్ అవుతూ వచ్చారు. వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం పట్ల, ఆయా నియోజక వర్గాల్లో, గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళని ముఖ్యమంత్రి బుజ్జగించారు. చాలా నియోజక వర్గాల్లో ఇప్పటికీ కొత్తగా బిఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేకు, అక్కడ పోటీ చేసి, ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇదంతా తెలంగాణ సమాజం చూస్తోంది. ఇది చూస్తున్న క్రమంలో బిఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం పైన, బిఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తున్న సందర్భంగా, అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట, ఏమవుతది అనర్హత వేటు ఎలా పడుతుంది. గతంలో పార్టీ మారిన వాళ్ళ పైన పడిందా, అనర్హత వేటు ఇప్పుడు ఎలా పడుతుంది. అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడు ఉంది కదా, అప్పుడున్న చట్టాలే ఇప్పుడు ఉన్నాయి కదా, అప్పుడు పడని అనర్హత ఇప్పుడు ఎలా పడుతుంది అంటూ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి మాట్లాడడం చూశాం. మనం కానీ సుప్రీం కోర్టు డైరెక్షన్ తర్వాత, సుప్రీం కోర్టులో బిఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం తర్వాత, కేటీఆర్ పర్టిక్యులర్ గా దీనిపైన ఇనిషియేట్ తీసుకొని ఢిల్లీకి వెళ్లి, ఈ కేసుని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తూ, వాళ్ళ పైన అనర్హత వేటు పడేలా, సుప్రీం కోర్టులో వాదనలు వినిపించేలా చేస్తూ, ఈ కేసుని ఫాలో అప్ చేసిన తర్వాత, సుప్రీం కోర్టులో డైరెక్షన్ ఇచ్చింది. స్పీకర్‌కి ఆ సందర్భంగా ముఖ్యమంత్రే మళ్ళీ మాట్లాడిన మాట, వాళ్ళు మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు అని, వాళ్ళని మేము పార్టీలో చేర్చుకోలేదని ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడడం చూశాం. పీసీసి అధ్యక్షుడు అయితే అది జాతీయ జెండా కప్పుకున్నారు, అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు అని అన్నారు, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరువు గంగలో కలిసిపోయింది. అంతకుముందేమో మేమే చేర్చుకున్నామని చేర్చుకొని, ఆ తర్వాత చేర్చుకుంటే తప్పేంటి, గతంలో కేసిఆర్ చేయలేదా అని మాట్లాడి, ఇప్పుడేమో మా పార్టీలో చేరలేదు అంటూ ప్రకటనలు వాళ్ళు చేయడం చూశాం. ఆ తర్వాత స్పీకర్ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత ఏదో ఒకటి చెప్పక తప్పని పరిస్థితిలో, స్పీకర్ చెప్పిన మాట వాళ్ళంతా, బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేదానికి ఆధారాలు లేవు అన్నారు. స్పీకర్ కూడా పలచన అయిపోయారు. స్పీకర్ పట్ల కూడా గౌరవం తగ్గిపోయేలా ఆయన బిహేవ్ చేశారు. ఇలాంటి ఇంప్రెషన్ కనపడింది. ఇక ఇప్పుడు పటాన్‌చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిన్న ఒక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి తప్పు చేశాను, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం వల్ల వెంట్రుక కూడా నాకు లాభం జరగలేదు, నా కార్యకర్తలకు లాభం జరగలేదు, నా నియోజక వర్గానికి లాభం జరగలేదు, మహిపాల్ రెడ్డి స్వయంగా మాట్లాడిన మాట. కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే గా కంటిన్యూ అవుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ, ముఖ్యమంత్రిని కలిసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిపాల్ రెడ్డి, ఆ పార్టీలో చేరడం వల్ల నాకు, నియోజక వర్గానికి కార్యకర్తలకు ఎవరికీ ఏం ఉపయోగం లేదు అనే మాట మాట్లాడి, మూడు సార్లు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలు చేసిన బిఆర్ఎస్ పార్టీని వదిలి తప్పు చేశాను, బిఆర్ఎస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిద్దాం అనే ప్రకటన చేశారు. ఇది రేవంత్ రెడ్డికి అవమానం, రేవంత్ రెడ్డి పాలనకు అవమానం, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ప్రశ్నించే తరహా వ్యాఖ్యగా చూడాలి. నీ పార్టీలోకి ఒక 10 మంది వస్తే. ఆ 10 మందిని నువ్వు నిలుపుకోలేకపోతే. ఆ 10 మందిని నువ్వు కాపాడుకోలేకపోతే. వాళ్ళే బయటికి వచ్చి ఆ పార్టీలో చేరి తప్పు చేశాం, అనే ప్రకటనలు చేస్తుంటే అది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కచ్చితంగా అవమానం కదా? ఈ అంశంపై పూర్తి విశ్లేషణ..!


