కాంగ్రెస్ పార్టీకి బలం బలహీనత గ్రూపులు, కొట్లాటలు, తగాదాలు. కానీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఇవేమి నడిచినా ఓకే.

కాంగ్రెస్ పార్టీకి బలం బలహీనత గ్రూపులు, కొట్లాటలు, తగాదాలు. కానీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఇవేమి నడిచినా ఓకే. అధికారం లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం, ఒకరి పైన ఒకరు గ్రూపులు కట్టడం ఇవన్నీ చూస్తూంటాం. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పలచన చేస్తాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది, రెండు సంవత్సరాలు గడుస్తుంది, కానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారులో ఇటీవల పరిణామాలు కలకలం రేపుతున్నాయి.

కాంగ్రెస్ ఇంతే, కాంగ్రెస్ వస్తే ఇలాగే ఉంటుంది అని సామాన్య ప్రజలు కూడా అనుకునేలా కనపడుతున్నాయి, ఏంటి విషయం, ఏంటి కలకలం అంటే, ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, పొన్నం ప్రభాకర్ మధ్య రేగిన దున్నపోతు వివాదం చూశాం. దున్నపోతు వ్యాఖ్యలు సృష్టించిన కలకలం చూశాం. ఆ దున్నపోతు వ్యాఖ్యల కారణంగా ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మంత్రి మాట్లాడారు అనేది బయటికి వెళ్ళిపోయింది. ఈ విషయంలో పొన్నం ప్రభాకర్‌- అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కాంప్రమైజ్ కావచ్చు కానీ ఆయన మాట్లాడిన మాటలు క్రింది స్థాయి వరకు వెళ్ళాయి, ప్రభుత్వం పైన అవి వ్యతిరేకతను పెంచడానికి కారణం అవుతున్నాయి, దాంతో పాటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పైన, వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రులు అసహనంగా ఉన్నారని, వరంగల్ వ్యవహారాల్లో పొంగులేటి అతిగా జోక్యం చేసుకుంటున్నారని, సమక్క- సారక్క జాతరకు సంబంధించిన పనులు తనకు తెలియకుండానే ఆయన అక్కడ కాంట్రాక్టులు ఎలా ఇచ్చేస్తున్నారని, సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారని రకరకాల వార్తలు బయటికి వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ అధిష్టానానికి కూడా ఆయన పైన కంప్లైంట్ చేశారు. ఆయన కొండా సురేఖకు వ్యతిరేకంగా, వరంగల్ జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేసి కొండా సురేఖని టార్గెట్ చేయిస్తున్నారు అక్కడ అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. సురేఖ ఫిర్యాదు తర్వాత ఆ చర్చకు మరింత బలం చేయకూరింది. వరంగల్ జిల్లా గడిచిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు ఇచ్చిన జిల్లా, ఖమ్మం జిల్లా మెజారిటీ సీట్లు ఇచ్చిన జిల్లా, అటువంటి ప్రాంతాల్లో కూడా వర్గ పోరాటాలు, కొట్లాటలు, గొడవలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెడుతున్నాయి. దానితో పాటు హైదరాబాద్ లో, జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక సందర్భంగా జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక, గడిచిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో తుడిచి పెట్టుకుపోయింది, అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో పెద్దగా బలం లేదు, సో మొన్నటి ఉపఎన్నికలో కంటోన్మెంట్ ఉపఎన్నికలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ, టిఆర్ఎస్ అభ్యర్థి మరణించిన తర్వాత జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. తాజాగా మరో ఉపఎన్నిక వచ్చింది, జూబ్లీ హిల్స్ కి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానంలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి అవసరం.

రెండేళ్ల తర్వాత తాము ఏం చేసామో ప్రజలకి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నిక, హైదరాబాద్ లో జరుగుతున్న ఎన్నిక, హైదరాబాద్ లో బలం లేదు అని ప్రచారం ఉన్న ఎన్నిక, ఇంకొక ఆరు నెలల్లో లేదా ఏడాదిలో జీహెచ్ఎంసి ఎన్నికలు జరగాల్సిన ప్రాంతం. ఇటువంటి చోట గెలవడం కాంగ్రెస్ పార్టీకి అవసరం, ఇటువంటి చోట టికెట్ల కేటాయింపు అంశం కూడా హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపడం చూస్తున్నాం. అంజన్ కుమార్ యాదవ్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, హైదరాబాద్ నేత, ఆయన నాకు తెలియకుండా టికెట్ ఎలా ఇస్తారు, నాకు తెలియకుండా టికెట్ ఇచ్చారు, కాబట్టి నేనేంటో చూపిస్తాను అంటూ వార్నింగ్‌లే ఇవ్వడం చూస్తున్నాం. నాకు తెలియకుండా కనీసం నన్ను సంప్రదించకుండా, టికెట్ ఎలా ఇస్తారు అని చెప్పి మాట్లాడడం చూస్తున్నాం. నేను మా కుటుంబంలో ఒక వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి, నేను టికెట్ కి అర్హుడిని కాకుండా పోతానా, కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళంతా ఒకే కుటుంబంలో రెండు- మూడు పదవులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి, బీసీని కాబట్టే నేను పదవికి అర్హతని కాకుండా పోయానా అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా కాంగ్రెస్ పార్టీని డామేజ్ చేస్తున్నాయి.ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



Updated On
ehatv

ehatv

Next Story