ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనబడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనబడుతుంది. గత సర్కారు హాయాంలో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారనో టీడీపీ నాయకుల పైన కేసులు పెట్టారన్న కక్షతో, కొంతమంది అధికారుల పేర్లు రాసుకొని మరి వాళ్ళని వేధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటమి సర్కార్. ఈ మాట చెప్పడానికి నేను ఎక్కడ వెనక్కి పోదలుచుకోలేదు ఆ పేర్లు రాసుకుని, కొంతమంది అధికారుల పేర్లు రాసుకొని.. మీ సంగతి చూస్తామంటూ వార్నింగ్‌లు ఇచ్చి బహిరంగంగా పుస్తకంలో పేర్లు రాసుకున్నాం, మీకు పోస్టింగ్లు ఎలా వస్తాయో చూస్తాం, మీ సంగతి ఏంటో చూస్తాం, చట్టపరంగా శిక్షిస్తామంటూ బెదిరింపు ధోరణలో మాట్లాడారు. కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీల నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు డజన్ మందికి పైగా సివిల్ సర్వీసెస్ అధికారులను పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఆపేశారు, కొంతమందిని వేధించారు, అనేక మంది పైన కేసులు నమోదు చేశారు. అనేక మంది ఇంకా ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఒక డీజీ స్థాయి అధికారిని ఒక డీజీ స్థాయి అధికారి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులని జైలుకు పంపించి ప్రస్తుతం రిమాండ్‌లో పెట్టింది, ప్రస్తుతం కస్టడీలో ఉంచింది.

ప్రభుత్వం పోలీసులు సో ఇంటెన్షనల్ గా కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనడానికి సంబంధించి ఎవరికీ ఎటువంటి అనుమానాలు కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన దీనికి గత ప్రభుత్వంలో ఇలా చేశారు కాబట్టి అంటూ గత ప్రభుత్వం కారణంగా ఈ ఐఏఎస్‌లు, ఈ ఐపీఎస్‌లు జైలుక వెళ్ళారు అంటూ ఒక క్యాంపెయిన్ చేయాలని శ్రీకారం చుట్టినప్పటికీ, ఆ అధికారులకు సంబంధించిన తప్పులు ఏంటో తేల్చడంలో ఫెయిల్ అయిన కారణంగా వాళ్లకి పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టిందే తప్ప వాళ్ళ పైన కేసులని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది సర్కారు. ఇప్పుడు తాజాగా కొంతమంది ఐపీఎస్‌ అధికారులని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్స్‌ని కంటిన్యూ చేస్తూ వస్తుంది, సస్పెన్షన్ కి సంబంధించిన అధికారులు పోరాటం చేస్తూ వచ్చారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు డిజీ స్థాయి అధికారి, ఆయన్ని జైల్లో పెట్టడం పైన చాలా పెద్ద ఎత్తున బ్యూరోక్రసీలో వ్యతిరేకత వస్తుంది. ఇది సరైంది కాదు ప్రభుత్వం ఈ స్థాయిలో వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదు లాంటి విమర్శలు కూడా ప్రభుత్వంపై వస్తున్నాయి.ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story