నెల్లూరు జిల్లా నుంచి వచ్చే జమీన్ రైతు అనే ఒక పత్రికలో ఏడో తారీఖున ఒక కథనం వచ్చింది.

నెల్లూరు జిల్లా నుంచి వచ్చే జమీన్ రైతు అనే ఒక పత్రికలో ఏడో తారీఖున ఒక కథనం వచ్చింది. ఆ కథనం చాలా ఆసక్తికరంగా కనిపించింది. ఆ కథనంలో వాస్తవం ఉందో లేదో తెలీదు, ఆ పత్రిక కూడా ఇది వాస్తవమో కాదో తెలియదు, కానీ సంఘటనలన్నీ చూస్తే ఇష్యూస్ అన్నీ ఒకదానికొకటి లింక్ అప్ చేస్తే ఇది నమ్మేలా ఉంది. కాబట్టి ఈ పత్రికలో ఈ కథనాన్ని రాస్తున్నామని చెప్పి రాసింది. ఈ పత్రికకు చాలా పేరు ఉంది నెల్లూరు జిల్లా నుంచి వస్తున్న పత్రిక ఇది, ఈ పత్రికకు చాలా పేరుంది స్వాతంత్రానికి పూర్వం నుంచి జమీన్ రైతు పేరుతో అక్కడ ఈ పత్రిక నడుస్తోంది. ఆ జిల్లాకు సంబంధించిన, ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక వార్తల్ని రాష్ట్రానికి సంబంధించిన అనేక వార్తల్ని, కూడా చాలా సందర్భాల్లో బ్రేక్ చేసిన చరిత్ర ఉంది జమీన్‌ రైతుకి. ఆ పత్రిక రాసిన ఒక కథనాన్ని నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. జస్ట్ మీకు చదివి వినిపిస్తా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామా, ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామాకు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందా, ఏ రకమైన సంబంధం ఉంది, అనిల్ అంబానికి ధన్కడ్ రాజీనామాకి సంబంధం ఉందా, ఏ రకంగా సంబంధం ఉంది, నారా లోకేష్ కి ధన్కడ్ రాజీనామాకి సంబంధం ఉందా, ఏ రకంగా సంబంధం ఉంది, కేజ్రీవాల్‌కి ధన్కడ్ రాజీనామాకి సంబంధం ఉందా, ఏ రకంగా సంబంధం ఉంది అనేది ఈ పత్రికకు ఉన్న సమాచారం మేరకు వాళ్ళు రాశారు.

ఆంధ్ర రాష్ట్రంలో అనిల్ అంబాని కేసుల మూలం విశాఖలో పరిశ్రమ కోసం వచ్చి నోరుజారిన నేరానికి సిబిఐ ఈడి ఉచ్చులో చిక్కుకున్నాడట. పాపం అంబానీతో తన ముచ్చట్లు మోడీకి తెలిసిపోయాయని హడలిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు కథనాన్ని నేను మీకు యస్ ఇట్ ఈస్ గా చదివి వినిపిస్తా, జమీన్ రైతు వారపత్రిక స్థాయికి పరిధికి మించిన వార్త ఇది, వాళ్ళే రాసుకున్న మా,ట స్థానిక పత్రికగా మా పరిమితులు మాకు తెలుసు కానీ కాకతాలీయంగా తెలిసిన సమాచారం నమ్మదగినదిగా ఉండడంతో, వార్తగా ఇస్తున్నాం, రిలయన్స్ అంబాని తమ వద్ద తీసుకున్న అప్పులలో ఫ్రాడ్ జరిగిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెలాకరణ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వెంటనే బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులని వరసపెట్టి అనిల్ అంబాని డిఫాల్టర్ అని ప్రకటించాయి, ఆ వెంటనే సిబిఐ రంగంలోకి దిగి కేసులు నమోదు చేసింది. వెంటనే ఈడి ముందుకు వచ్చి అనిల్ అంబానీ ఆస్తులని జప్తు చేసింది. మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో అంబానీ కుటుంబ సభ్యుల మీద ఈ స్థాయిలో దండయాత్ర జరగడం పారిశ్రామిక వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇదే అంబానీ, ఇదే బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తిరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్న సమయంలో, ప్రధాని మోదీ తన వెంట అంబానీని ఫ్రాన్స్ దేశానికి తీసుకువెళ్లి, రఫెల్ కంపెనీతో ఆయన ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి సహకారం అందించారు.

ఆ క్రోనిక్ క్యాపిటలిజం జగమెరిగిన సత్యం. దాని విషయంలో ప్రతిపక్షాలు ఎంత రచ్చ చేసినా మోదీ సమాధానం చెప్పలేదు, ఆ సమయంలో రాహుల్ గాంధీ నేను ఒక ఆటం బాంబు వేస్తాను రఫెల్ డీల్ కి సంబంధించి అని చెప్పింది ఇదే, 10 లక్షల రూపాయల మూలధనంతో ఉన్న ఒక కంపెనీకి అనిల్ అంబానీ కంపెనీకి 40 వేల కోట్ల రూపాయల రఫెల్ విమానాలు తయారు చేసే కాంట్రాక్ట్ మోడీ ఇప్పించారు. దీని వెనక అవినీతి జరిగిందని ఆ సమయంలో రాహుల్ గాంధీ చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం చూశాం. సో ఎంత రచ్చ చేసినా మోదీ సమాధానం చెప్పలేదు, అంబాని, ఆదాని కుటుంబాలతో మోదీకి, బిజెపీ పార్టీకి ఉన్న విడదీయరాని బంధం తెలియని వారు లేరు. మోదీ ప్రధానిగా పదవి చేపట్టిన తర్వాత ఆదాని ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయో పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టు, బొంబాయ్ ఎయిర్‌ఫోర్టు, గంగవరం పోర్టు వంటి ఎన్నో ఆస్తులను ఆదాని ఏ రకంగా వశం చేసుకున్నది కథలు కథలుగా ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story