మార్గదర్శి కేసు గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

మార్గదర్శి కేసు గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్గదర్శి కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద చర్చ చూశాం. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ అంశానికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించిన వాదనలు వింటూ ఉన్నాం. ఒకటి రామోజీ వైపు నుంచి, మరోవైపు రామోజీరావు అక్రమాలు చేశారంటూ కేసులు పెట్టిన ప్రభుత్వాల వైపు నుంచి. రామోజీరావు అక్రమంగా, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా, నిధులు వసూలు చేశారు, డిపాజిట్లు సేకరణ చేశారు, సేకరించిన డిపాజిట్లను మళ్ళీ తన దగ్గరే పెట్టుకున్నారు. సో ఇలా రకరకాల అలిగేషన్స్ పైన ఆయనపైన కేసు నమోదయింది, 2008లో అప్పటి రాజశేఖర్ రెడ్డి సర్కార్ ఆయన పైన కేసు నమోదు చేసింది. సో ఈ కేసు నమోదు చేసిన సందర్భంగా రామోజీ రావు చేసిన మోసం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసింది. దీనిపైన కోర్టులు కూడా రామోజీ ఈ రకంగా డిపాజిట్ల సేకరణ తప్పే, అనే విషయాన్ని చెప్పాయి. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కోర్టు ఇంటెన్షన్ రాంగ్, ఇంటెన్షన్ తో చేసింది కాదు, పైగా డిపాజిటర్లు ఎవరూ కూడా తమకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేయలేదు, వాళ్ళఎవరూ కూడా బాధితులుగా లేరు అంటూ ఆయనకు క్లీన్ చిట్‌ ఇచ్చే ప్రయత్నం కూడా హైకోర్ట్ చేసింది. ఆ తర్వాత పిటిషనర్ గా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టు కి వెళ్ళారు. సుప్రీం కోర్టు ఈ కేస్ ని మళ్ళీ విచారించమని చెప్పింది, విచారించమని చెప్పిన తర్వాత ప్రభుత్వాలు కావాలనో, లేకపోతే మరో కారణంతోనో ఈ కేసు పైన కోర్టులో సరైన వాదనను వినిపించకుండా పక్కన పెట్టేశాయి. ఏపీ లో 2019 -24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేష్‌లో మార్గదర్శి బాధితుల పక్షాన, మార్గదర్శి సేకరించిన డిపాజిట్లు అక్రమం అంటూ మరోసారి ఈ కేసుని తిరగదోడే ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ కూడా వేసింది, ఆ తర్వాత ఈ కేసు ఉధృతంగా నడుస్తున్న సమయంలో రామోజీ అరెస్టు కి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో రామోజీ తాను తప్పు చేయలేదు అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి, నేను తప్పు చేయలేదు అని చెప్పలేదు, కానీ నా వల్ల ఎవరికీ నష్టం జరగలేదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే ఆయన చేస్తూ వచ్చారు. డిపాజిట్ల సేకరణ చేయడం ఓ రకమైన క్రైమ్ అయితే, మార్గదర్శి ఫైనాన్షియల్స్ పేరుతో మరోవైపు, చిట్టీల పేరుతో మార్గదర్శి చిట్స్ పేరుతో వసూలు చేసిన డబ్బులు కంప్లీట్ చిట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వకుండా, వాటిని తన దగ్గరే, తమ సంస్థలోనే పెట్టుకున్నారు అనేది మరో ఆలిగేషన్ కూడా ఉంది. సో రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ కి విరుద్ధంగాచ రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగాచ డిపాజిట్లు సేకరణ చేశారు అనే దానికి సంబంధించి ఎవరికీ కూడా ఎటువంటి అనుమానాలు లేవు. దాంతో పాటు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరుతో, డిపాజిట్లు సేకరణ చేశారు. హెచ్ఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరణ ఇంతమంది దగ్గర బయట నుంచి చేయడం ఇది చట్టాన్ని ఉల్లంఘించటం అని విచారణ సంస్థలు చేసిన ఆర్గ్యుమెంట్ కూడా కోర్టుల ముందు నిలబడింది. దాని నుంచి రకరకాల లీగల్ హోల్స్ ని బేస్ చేసుకొని. వాటిని అడ్డం పెట్టుకొని. ఆయన తప్పించుకుంటూ వచ్చారు. శిక్ష పడకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారని చెప్పొచ్చు. ఈ అంశానికి సంబంధించి కోర్టులు కూడా తప్పు జరిగిందనే విషయాన్ని గుర్తించాయి. కాబట్టి ఆయనకి సంబంధించిన దాదాపు 2000 కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసినట్లుగా కూడా వార్తలు చూశాం. ఆ తర్వాత ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత సీజ్‌ చేసిన ఆస్తుల్ని, రిలీజ్ చేసిన పరిస్థితిని కూడా చూశాం. సో ఈ మొత్తం ఉపోద్గాతం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, రామోజీ పైన నమోదైన కేసుని ఆల్మోస్ట్ కొట్టేసింది కోర్టు. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..!



Updated On
ehatv

ehatv

Next Story