Congress leadership: కాంగ్రెస్ అధిష్టానం మొద్దు నిద్రలో ఉందా..! మంత్రులు కొట్లాడుతుంటే కనీసం మాట్లాడదా..!
Congress leadership: కాంగ్రెస్ అధిష్టానం మొద్దు నిద్రలో ఉందా..! మంత్రులు కొట్లాడుతుంటే కనీసం మాట్లాడదా..!

కాంగ్రెస్ వ్యవహారాలు ఇటీవల కాలంలో చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసలు అధిష్టానం ఉందా అనిపిస్తుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, కిరణ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, ఆ మాటక వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన ముద్ర రాష్ట్ర కాంగ్రెస్ పైన కనబడుతూ వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్న అభిప్రాయాలు ఉన్న నాయకత్వానికి సంబంధించిన ఎగ్జిస్టెన్సీ చూసేవాళ్ళం. ఇక్కడ నాయకత్వాన్ని లీడ్ చేస్తూ, ఇక్కడ నాయకత్వం వహిస్తున్న వాళ్ళ పట్ల వ్యతిరేక అభిప్రాయం ఉన్నవాళ్ళు, ఇక్కడ నాయకత్వంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పనుల పట్ల, వేరే అభిప్రాయం ఉన్నవాళ్ళు, కూడా పార్టీలో కంటిన్యూ అయ్యే వాతావరణం గతంలో ఉండేది. అంతేకాదు ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల అపోజిషన్‌లో ఉన్నా, అధికారంలో ఉన్నా ఇక్కడ జరుగుతున్న, పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఎప్పటికప్పుడు అధిష్టానం, ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేయడం ఉండేది. అటువంటి ఒక మెకానిజం ఉండేది, పార్టీకి సంబంధించిన నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా, రకరకాల మార్గాల ద్వారా అధిష్టానం రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఉండేది. ఎప్పటికప్పుడు తెలుసుకుని పార్టీని బలోపేతం చేయడం కోసం, పార్టీకి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే, వాటిని సరిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేది. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మోడ్ ఆఫ్ ఆపరెండా, కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో కార్యక్రమాలు అలాగే నిర్వహిస్తూ వచ్చింది. కానీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణలో అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అనే ఆలోచించే తీరిక కూడా అధిష్టానానికి ప్రస్తుతం ఉన్నట్టు కనపడట్లేదు. అధిష్టానం ఢిల్లీలో చలి బాగా ఉంది కాబట్టి ముసుగుద్దన్ని పడుకుందేమో అనిపిస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తావనే, రాష్ట్ర కాంగ్రెస్ లో లేకుండా పోయింది. నేను అధిష్టానం దగ్గరికి వెళ్తాను, మా నాయకత్వానికి చెప్తాను, రాహుల్ గాంధీ మా నాయకుడు, సోనియా గాంధీ మా నాయకురాలు, ఇటువంటి ప్రకటనలే రాష్ట్ర కాంగ్రెస్ లో వినపడట్లే, ఇది రాష్ట్ర కాంగ్రెస్ కు ప్రమాదం, నిజానికి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, మూడు సార్లు, నాలుగు సార్లు వరసగా ఓడిపోతూ వస్తుంది. అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ ఓడించి అధికారంలోకి రావడానికి కష్టపడుతోంది. ఆ భారతీయ జనతా పార్టీ ఏమో అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా గెలుస్తూ పోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కష్టపడాల్సి వస్తుంది, నిలబెట్టుకోలేకపోతుంది, అలాంటిది 10ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తే, మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రావాలనే స్పృహ సోయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నట్టు కనపడట్లే. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చాలా సందర్భాల్లో, చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నాం కాబట్టి, ఇక్కడున్న పరిస్థితులన్నీ చూసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఇలా గతంలో ఎప్పుడూ లేదు అని చెప్పడం నా ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయకులు గన్ పెట్టి మమ్మల్ని బెదిరించారు అని, ముఖ్యమంత్రిపైన నేరుగా ఓ మంత్రి కూతురు ఆరోపణలు చేసింది. ఓ మంత్రి పిఏని మంత్రికి తెలియకుండా సస్పెండ్ చేశారు. ఓ మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. ఓ నిందితుడిని అరెస్ట్ చేయడం కోసం. ఇవి గతంలో ఎప్పుడూ మనం చూడలే, గతంలో ఎప్పుడూ మనం చూసినవి కాదు, అంతేకాదు మరో మంత్రికి వ్యతిరేకంగా ఇంకో మంత్రి మాట్లాడారు, ఇద్దరు మంత్రుల మధ్య పోట్లాట చూశాం. ఇద్దరు మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టుకొని మరీ, ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకోవడం చూశాం. మేడారం టెండర్ల అంశానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య, కొండా సురేఖకు పొంగులేటికి మధ్య జరిగిన గొడవ చూశాం. అలాగే కొండా సురేఖ పిఏ వ్యవహారం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పిఏ వ్యవహారం చూశాం. కొండా సురేఖ కూతురు మాట్లాడిన మాటలు చూశాం. తాజాగా కోమటిరెడ్డి వ్యవహారం చూస్తున్నాం. కోమటరెడ్డి వెంకటరెడ్డి పైన వచ్చిన కథనాలు, ఆ కథనాలకు రావడానికి కారణమైన అంశాలు ఇవి చూస్తున్నాం. నేరుగా బట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలి, తెలంగాణ రాష్ట్రానికి అన్నప్పుడు రేవంత్ రెడ్డా, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇటువంటి చర్చ జరిగిన సందర్భాన్ని చూశాం. అటువంటి భట్టి విక్రమార్క పైన మరో మంత్రికి ఆయనకే పడట్లేదంటూ పత్రికా కథనాలు వస్తుంటే, బట్టి విక్రమార్క అవినీతికి పాల్పడ్డారు అంటూ కథనాలు వస్తుంటే, ఆ కథనాలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే మీడియాలో కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి బాకా ఊదే మీడియాలో వస్తుంటే, అధిష్టానానికి ఏం పట్టకుండా అయిపోయింది. అంతేకాదు మరో మంత్రి జూపల్లికి వ్యతిరేకంగా వార్తా కథనాలు చూశాం. జూపల్లి వల్ల నేను ఈ పదవిలో కొనసాగలేకపోతున్నాను అంటూ ఒక ఐఏఎస్ అధికారి పదవిని వదిలిపెట్టాడు అంటూ వార్తలు చూశాం. ఆయన పదవిని వదిలిపెట్టిన మాట కూడా నిజం. అంతే కాదు ఉత్తం కుమార్ రెడ్డి పైన కూడా కొండా సురేఖ ఆరోపణలు చేయడం చూశాం. కాంగ్రెస్ పార్టీ పూర్తి క్యాబినెట్ ఈ క్షణానికి కూడా ఇంకా ఏర్పాటు చేయాలేదు. 17 మంది క్యాబినెట్ లో ఉండానికి సంబంధించిన అవకాశం ఉంది. ఇంకా క్యాబినెట్ లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉన్న క్యాబినెట్‌లో ప్రతి మంత్రి కూడా వివాదం అవుతుంటే, ఒక తుమ్మల నాగేశ్వరావు తప్ప దాదాపు ఆల్మోస్ట్ అందరి మంత్రుల పైన రకరకాల వివాదాలు వచ్చాయి. అందరు మంత్రుల పైన వివాదాలు వస్తుంటే, మంత్రులు దోచుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించట్లేదు లాంటి ఒక ఇంప్రెషన్ బిల్డ్ అవుతుంటే, మంత్రులు కొట్లాటలన్నీ ఒక పథకం గురించో, ఒక కార్యకర్తకు పదవి గురించో లేకపోతే, ఒక ప్రాంతానికి న్యాయం చేయడం గురించో కాకుండా, టెండర్ల గురించి, వర్కుల గురించి వసూళ్ల గురించి వీటి గురించే ఉంటుంటే, కాంగ్రెస్ అధిష్టానానికి పట్టాలి కదా.ఈ అంశంపై పూర్తి విశ్లేషణ..!


