జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలపైన, తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ మీడియాలో చర్చ చేయలేకుండా పోయింది.

జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలపైన, తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ మీడియాలో చర్చ చేయలేకుండా పోయింది. అత్యంత దుర్మార్గంగా, అత్యంత నీచంగా, విచక్షణ కోల్పోయి మనిషినని మర్చిపోయి, ఓ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దిగజారి మాట్లాడితే, ఈ క్షణానికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్‌గా అతని పైన చర్య తీసుకున్నది లేదు, ఆ ఎమ్మెల్యే 30 సెకండ్లు బయటికి వచ్చి అది నాది కాదు, అయినా సారీ అంటూ చెప్పి వెళ్ళిపోయాడు, ప్రభుత్వం నుంచి యాక్షన్ లేదు, నా తల్లికి అవమానం జరిగినట్టు ఇంకెవరికీ జరగనీయనని చెప్పిన నాయకుడు జాడ లేదు, నారా లోకేష్ కి ఒక అవకాశం ఉంది, తాను ఏ మహిళకు అన్యాయం జరిగినా, సరిగ్గా స్పందిస్తాడని ప్రజలకు చెప్పుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ తో, తనకి విభేదాలు లేవని చెప్పుకోవడానికి, ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది.

దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం, బట్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నట్టు కనపడట్లే, పైకి ఏదో సీరియస్ గా వ్యాఖ్యానించినట్లు, ఎమ్మెల్యే పైన సీరియస్ అయినట్లు, లీకులు ఇచ్చి వదిలేస్తున్నారు, మిగతా ఎమ్మెల్యేలు అందరి విషయంలో స్పందించినట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే విషయంలో కూడా స్పందించినట్లుగా, సొంత మీడియాకు కథనాలు, లీకులు ఇస్తూ వదిలేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా అలా వదిలేయదగింది కాదు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత, స్పందన ఇలాగేనా అనిపిస్తుంది, ఇంకా ఏం ఎవిడెన్స్ కావాల్సి ఉంది.

ప్రభుత్వానికి, అతని పైన చర్యలు తీసుకోవడానికి ఇంకా ఏం ఎవిడెన్స్ కావాల్సి ఉంది, ప్రభుత్వం, పార్టీ అతన్ని సస్పెండ్ చేయడానికి ఇంకా ఎటువంటి ఎవిడెన్స్ కావాల్సి ఉంది, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం గురించి, ఆ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలపైన కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవడానికి ఆ ఎమ్మెల్యే ఎవరైతే కార్యకర్తతో మాట్లాడారో, ఎవరైతే ఎన్టీఆర్ అభిమానితో మాట్లాడారో, ఆ అభిమాని స్వయంగా మా స్టూడియోకి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు, ఎమ్మెల్యే మాట్లాడిన మాటల గురించి చెప్పాడు కానీ, అతను ఎందుకు అంత అగ్రెసివ్ గా మాట్లాడారో కూడా నాకు అర్థం కావట్లేదు, సరే నేను మాట్లాడిన, మా అభిమాన హీరో తల్లిగారిని అనడం చాలా బాధేసింది, నేను కొంచెం ఈ రికార్డింగ్, నాది నా మొబైల్ ఆటోమేటిక్ రికార్డింగ్, కొంతమంది ఏమంటున్నారంటే, ఇది ఇలా రికార్డింగ్ బయట పెట్టడం పద్ధతి కాదు కదా అంటున్నారు, మా అభిమాన హీరో తల్లిగారిని, మా అభిమాన హీరోని తిట్టినందుకే నేను ఈ రికార్డింగ్ బయట పెట్టాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story