Journalist YNR : జగన్ పర్యటనలపై కేంద్రం ఆరా..!
ఆంధ్రప్రదేష్‌లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పర్యటనల పట్ల కూటమి సర్కారు ఎందుకంత కలవరం చెందుతోంది.

ఆంధ్రప్రదేష్‌లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పర్యటనల పట్ల కూటమి సర్కారు ఎందుకంత కలవరం చెందుతోంది. కూటమి సర్కార్ ఎక్కడ కలవరం చెందింది, అని అనుకుంటారేమో కూటమి సర్కారు కలవరం కనపడట్లే. జగన్మోహన్ రెడ్డి జనం దగ్గరికి వెళ్లిన ప్రతిసారి కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు, కూటమి సర్కార్ కనబడుతున్న ఆందోళన ఖచ్చితంగా చాలా చాలా తీవ్రమైనదిగా చూడాల్సిన అవసరం ఉంది.
జగన్మోహన్ రెడ్డి జనాల దగ్గరికి వెళ్తున్న సందర్భంగా, పరామర్శల పేరుతో ఆయన జనాల దగ్గరికి వెళ్తున్న సందర్భంగా, రకరకాల ఆంక్షలను ఇంపోజ్ చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది. పోలీసులు చెక్ పోస్టులు పెట్టి జగన్మోహన్ రెడ్డి చుట్టూ జనాలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం వైపు నుంచి నిర్బంధం ఎక్కువైన కొద్దీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ జనాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ జనాల సంఖ్య పెరగడం అనేది కూటమి సర్కార్‌కు బీపీ తెప్పిస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేష్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమిని చవిచూసింది.
ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది పూర్తవుతోంది, 11 సీట్లకు మాత్రమే వైసపీ పరిమితమైంది. 164 స్థానాల్లో కూటమి సర్కార్ విజయం సాధించింది సొంతంగా తెలుగుదేశం పార్టీ 134 స్థానాల్లో విజయం సాధించింది. సో ఈ పరిస్థితుల్లో కూటమి సర్కారు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు, నిజానికి కూటమి సర్కార్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే భారతీయ జనతా పార్టీ, జనసేన గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి సొంతంగా అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, సేమ్ టైం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు తెలుగుదేశం పార్టీ మద్దత్తతో నడుస్తోంది. ఇటువంటి సందర్భంలో తమ కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజెపీని కూడా పాంపర్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి, లేదు ఇక 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి ఉన్న పొలిటికల్ సిచువేషన్ చూస్తే కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఆందోళన పడుతున్నట్లు కనపడుతుంది.
ఆ ఆందోళన దాచుకోలేకపోతుంది కూడా, ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంత ఆందోళన పడుతోంది మరి ఈ స్థాయిలో ప్రజల మద్దతు గెలిచామఅని చెప్పుకుంటున్న పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డిఏ సర్కార్ ఉంటుందని చెప్తున్న పార్టీ వచ్చే 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మేము తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవరు పాలించే పరిస్థితి లేదు అని చెప్తున్న పార్టీ, ఇప్పటికిప్పుడు కూటంలో క్రాక్స్ వచ్చి విడిపోతారు లాంటి ఇంప్రెషన్ కూడా లేని సందర్భంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అంత ఆందోళన పడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనల పైన కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరుగుతున్న తీరుని సెంట్రల్ ఇంటెలిజెన్స్ గమనిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయిలో ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసిన తర్వాత కేంద్రం పర్యటనలకు సంబంధించి, అక్కడికి వస్తున్న ప్రజలకు సంబంధించిన స్పందన పైన రిపోర్ట్స్ తెప్పించుకుంటుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ.
