SIT Charge Sheet : సిట్ ఛార్జ్‌షీట్‌పై ఈసీకి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అంశానికి సంబంధించి సిట్ అధికారులు 300కు పైగా పేజీలతో ఒక చార్ట్ షీట్‌ని వేశారు.

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అంశానికి సంబంధించి సిట్ అధికారులు 300కు పైగా పేజీలతో ఒక చార్ట్ షీట్‌ని వేశారు. ఆ చార్జ్‌షీట్‌లో ఉన్న అంశాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కుక్డ్ స్టోరీస్ గా ఉన్నాయి, బేస్లెస్ గా ఉన్నాయి, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా ఉన్నాయి, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా ఉన్నాయి లాంటి చర్చ న్యాయవర్గాల్లో జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఆ సిట్ చార్జ్‌షీట్‌లో మద్యం అంశంలో సంపాదించిన డబ్బులని, అప్పడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఖర్చు పెట్టార అనేది సిట్ ఆన్ రికార్డ్ అండ్ పేపర్ చార్ట్ షీట్ లో పేర్కొన్న అంశం. కొన్ని పార్లమెంట్ నియోజక వర్గాలలో మద్యం ద్వారా సంపాదించిన అక్రమ డబ్బుని ఖర్చు పెట్టారు అనే విషయాన్ని సిట్ నిర్ధారించి చార్జ్ షీట్‌లో పేర్కొంది, సిట్ చార్జ్‌షీట్ లో పేర్కొంది అంటే దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా సిట్ దగ్గర ఉండి ఉండాలి, సిట్ చార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలని నిరూపించే బాధ్యత కూడా సిట్ అధికారులకే ఉంటుంది, కోర్టుల ముందు దాన్ని నిరూపించలేకపోతే సిట్ అధికారులు నవ్వుల పాలవుతారు. సో దాదాపు ఏడాది కాలంగా ఈ అంశంపైన విచారణ చేస్తున్న దర్యాప్త సంస్థలు, విచారణ సంస్థలు ఎన్నికలలో ఈ డబ్బులు పంచారు అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత చార్జిషీట్‌లో ఈ అంశాన్ని పేర్కొన్నారు. కాబట్టి ఈ అంశం పైన జైభీంరావు భారత్ పార్టీ ఎలక్షన్ కమిషన్‌కు ఒక లేఖ రాసింది, ఓ దొంగతనం జరిగినప్పుడు అవినీతి కార్యక్రమం జరిగినప్పుడు, దానికి సంబంధించిన డబ్బు ఎక్కడెక్కడైతే డిస్ట్రిబ్యూట్ జరుగుతుందో, ఆ డిస్ట్రిబ్యూషన్ జరిగిన డబ్బును తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్కామ్ లో బాధితులుగానే చూడాల్సి ఉంటుంది. సో ఎన్నికలకు సంబంధించిన ఈ డబ్బు అంతా ఓటర్లకు పంచిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా మద్యం స్కామ్ లో భాగస్వాములుగా ఎందుకు చూడలేమనే ప్రశ్న ఆయన రైజ్ చేస్తున్నారు, ఈ అంశానికి సంబంధించే ఆయన ఎలక్షన్ కమిషన్‌కు, వాళ్ళ పార్టీకి సంబంధించిన, జై భీమరావ్ భారత్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రెటరీ పర్సద్ సురేష్ కుమార్ ఈరోజు ఎలక్షన్ కమిషన్‌కు ఒక లేఖ రాశారు. అందులో ఏముంది.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
