ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh)ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh)ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీకి చెందిన నాయకులపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (Ysr Congress Party)ఆరోపిస్తోంది. దాడులకు సంబంధించిన విషయాలపైన, శాంతిభద్రతల అంశంపైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో(Delhi)ధర్నా కూడా చేసింది. ఈ ఆందోళన కార్యక్రమానికి విపక్షాలకు చెందిన పలువురు నేతలు కూడా హాజరయ్యారు. మొత్తం మీద ఢిల్లీలో చేపట్టిన ధర్నా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. గడచిన 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అనేక పరిణామాలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వర్సెస్‌ తెలుగుదేశంపార్టీ(TDP) మధ్య వార్‌గా కనిపిస్తున్నాయి. తమ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశంపార్టీ దాడులు చేస్తున్నదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు ఏపీలో శాంతిభద్రతలు బాగా క్షీణించాయి. క్రైమ్‌(Crime)బాగా పెరిగింది. మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఓ ఆయుధం దొరికినట్టే అయ్యింది. ఇంత జరుగుతున్నా జనసేన పార్టీ (Janasena Party)మాత్రం పెద్దగా రియాక్టవ్వడం లేదు. ఇప్పుడు పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. పార్టీ విస్తరించడానికి ఇదో సువర్ణ అవకాశమని జనసేన భావిస్తోంది. ఇప్పుడు జనసేన పార్టీ చేరికలపై దృష్టి సారించింది. ఇప్పుడు జనసేనలో ఎవరు చేరతారన్న ప్రశ్న రావచ్చు. జనసేనలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్న నాయకులు ఎంత మంది ఉన్నారు? ఈ విషయాన్ని ఈ వీడియోలో చూసి తెలుసుదాం!


Updated On
ehatv

ehatv

Next Story