తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న వేళ ఎన్డీఏ నేతలు ఆంధ్రప్రదేష్‌లో ఓ రకంగా, దేశంలో ఓరకంగా, తెలంగాణలో ఓరకంగా ఎందుకు ఉంటున్నారని అనుమానం కలుగుతుంది.

తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న వేళ ఎన్డీఏ నేతలు ఆంధ్రప్రదేష్‌లో ఓ రకంగా, దేశంలో ఓరకంగా, తెలంగాణలో ఓరకంగా ఎందుకు ఉంటున్నారని అనుమానం కలుగుతుంది. ఆంధ్రప్రదేష్‌లో ఎన్డీఏ సర్కార్ నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నేతృత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌లో జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్డీఏ అంటే ఎన్డీఏ కానీ అటువంటి ఎన్డీఏ తెలంగాణకి వచ్చేసరికే ముక్కలుగా కనపడుతుంది, విచిత్రంగా కనపడుతుంది, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యంత్రాంగం ఉంది, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా మేము ఇక్కడ పొలిటికల్ ఫోర్స్ అంటూ క్లైం చేస్తూ ఉంది. ఇక్కడ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉంటుంది. గత 10ఏళ్ల కాలంలో చూశాం.

తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయాలు, క్యాడరు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, ఇంకా ఇక్కడ. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ తాము జాతీయ పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. తెలంగాణలోనూ ఒక కమిటీ, వ్యవస్థ, యంత్రాంగం అంతా ఉన్నాయి. ఇంత పెట్టుకొని తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎన్నికలు వచ్చేసరికి తూచ్‌ మేము పోటీ చేయమని వెళ్ళిపోతుంది. ఎన్నికల్లో పోటీ చేయం, ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రజల కోసం పని చేస్తామని చెప్తుంది. రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రజల కోసం పని చేస్తామని చెప్పడం ఏంటో, ఇప్పటి వరకు మనక ఎక్కడ దొరకదు, రిఫరెన్స్ కోసం కూడా వెతికితే, ఎక్కడ ఏ రాజకీయ పార్టీ అలా చేసినట్టు కనపడదు కానీ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా అలా చేస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కంటే, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం తాము పోటీ చేయకుండా, ఇంకెవరికో రహస్యంగా సహాయం చేస్తోంది లాంటి ఒక ఇంప్రెషన్ కి కారణం అవుతోంది. అటువంటి ఇంప్రెషన్ ని పార్టీ అధిష్టానం డెలిబరేట్ గా ఇస్తున్నట్టు కనపడుతుంది.

ఇప్పుడు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి డెఫినెట్ గా ఓట్ బ్యాంక్ ఉంది, ఎంతో కొంత 5000, 10,000 2000, 1000 ఓట్లు ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి జూబ్లీహిల్స్‌తో ఎందుకంటే ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళకి సంబంధించిన ఓట్లు ఇక్కడ ఉన్నాయి, 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత భర్త గోపీనాథ్ 2014 లో తెలుగు దేశం పార్టీ టికెట్ పైన జూబ్లీహిల్స్‌ నుంచి గెలిచారు. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నాయుడు సంబంధించిన నివాసం, అనేకమంది తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ,నాయకుల నివాసాలు ఈ ప్రాంతంలోనే ఉంటాయి. అటువంటి జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో ఎన్నిక జరుగుతుంటే తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావట్లే, తెలుగు దేశం పార్టీ మేము ఎన్నికలకు దూరం అని ప్రకటించింది. తెలుగు దేశం పార్టీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉండాలి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


Updated On
ehatv

ehatv

Next Story