ఆంధ్రప్రదేశ్‌లో(Andhra pradesh) కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం కొంచెం సిగ్గుపడండి..

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra pradesh) కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం కొంచెం సిగ్గుపడండి.. కనీసం సిగ్గుపడుతున్నట్టుగానైనా నటించండి. బుకాయింపులు ఆపండి. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల(Electric charges) పెంపు ఖరారయ్యింది. 6 వేల కోట్ల రూపాయలకు పైగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై భారం పడబోతున్నది. ఏడాది కాలంలో ప్రజల ముక్కు పిండి ఆరు వేల కోట్ల రూపాయలను వసూలు చేయబోతున్నది కూటమి ప్రభుత్వం. ఇది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కూటమి అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల ప్రచారంలో విద్యుత్‌ ఛార్జీల అంశంపై విపరీతంగా మాట్లాడారు కూటమి నాయకులు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలను పెంచమని, పైగా సంపద సృష్టించి కరెంట్‌ ఛార్జీలను తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు(Chandrababu) హామీ ఇచ్చారు. విద్యుత్‌ ఛార్జీలను పెంచే అవసరం తనకు లేదన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో ఎనిమిది సార్లో, తొమ్మిది సార్లో కరెంట్‌ చార్జీలను పెంచిందని ఎన్నికల ప్రచారంలో చెబుతూ వచ్చారు చంద్రబాబు. తాము అధికారంలోకి వస్తే కరెంట్‌ ఛార్జీల పెంపు అసలే ఉండదని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? కరెంట్‌ ఛార్జీలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో దీనికి వ్యతిరేకించే ప్రజా సంఘం ఒక్కటి కూడా కనిపించడం లేదు. ప్రజాసంఘాలు చాలా మట్టుకు రాజకీయ అనుబంధ సంస్థల్లా మారిపోయాయి. వామపక్షాలకు అంత తీరిక లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం మాత్రం కొంచెం కూడా సిగ్గుపడకుండా అవాస్తవాలు చెబుతూ వస్తున్నది. గత ప్రభుత్వం కారణంగానే విద్యుత్‌ ఛార్జీల భారం ప్రజలపై వేయాల్సి వస్తున్నదని నిసిగ్గుగా ప్రకటిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story