ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి(AP Deputy CM ), జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాన్‌(Pawan kalyan) ఓ ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి(AP Deputy CM ), జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాన్‌(Pawan kalyan) ఓ ప్రకటన చేశారు. పవన్‌ ఆ ప్రకటన చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. అది ఓ బాధ్యతాయుతమైన ప్రకటనగా అనిపిస్తోంది. విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్‌(Drugs) అంశానికి సంబంధించి విచారణ జరగాలని పవన్‌ కోరుతున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విశాఖపట్నం పోర్టుకు(Vizag Port) దాదాపు 25 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ వచ్చాయనే సమాచారం సంచలనం సృష్టించింది. ఆ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. అవి ఎవరి పేరిట వచ్చాయో తెలుసుకున్నారు. ఆ సందర్భంలోనే తెలుగుదేశంపార్టీ(TDP), వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల(YSRCP) మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ డ్రగ్స్‌ టీడీపీ దగ్గరవాళ్లకు చెందినవేనని వైసీపీ అంటే, వైసీపీ నాయకులే ఆ డ్రగ్స్‌ తెప్పించారని టీడీపీ ప్రత్యారోపణ చేసింది. అప్పుడు పార్టీలన్నీ రాజకీయపరమైన విమర్శలు చేసుకున్నాయే తప్ప విచారణ జరిగిందా? జరిగితే ఎవరిని అదుపులోకి తీసుకున్నారు? అన్న విషయాల జోలికి వెళ్లలేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నానికే కాదు, విజయవాడకు(Vijayawada) కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్‌ వచ్చాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని పవన్ కల్యాణ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. పవన్‌ చెప్పినట్టుగానే విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి. ఈ డ్రగ్స్‌ దిగుమతి వెనుక ఎవరున్నారనే విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ తేల్చగలిగితే ఆంధ్రప్రదేశ్‌ యువతకు ఆయన ఎంతో మంచి చేసినట్టవుతుంది. ఇది కేవలం రాజకీయపరమైన అంశంగా చూడకుండా విచారణ జరిపి అసలు దోషులను పట్టుకోవాలి. అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ విశాఖపట్నానికి వచ్చాయంటే అది మామూలు విషయం కాదు. తప్పకుండా దోషులను పట్టుకోవాలి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story