టీటీడీ చైర్మన్‌గా(TTD chairman) ఎవరుండాలి..

టీటీడీ చైర్మన్‌గా(TTD chairman) ఎవరుండాలి.. తిరుమలలో(Tirunmala) అపచారం జరిగిపోతుంది.. టీటీడీలో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. టీటీడీని ప్రక్షాళన చేయడం కోసం మేం ప్రయత్నం చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఎవరి హయాంలో టీటీడీ ప్రక్షాళన జరిగిందో చూడాలని వైసీపీ(YCP) నేతలు చెప్తున్నారు. దళిత గోవిందం, గిరిజనగోవిందంతో శ్రీవారిని దళిత, గిరిజనవాడలకు తీసుకొచ్చామని వైసీపీ చెప్తోంది. తిరుమలలో వేయి స్తంభాల గుడిని కూల్చిన చంద్రబాబు(Chandrababu).. టీటీడీ పవిత్రతను కాపాడనంటూ చెప్పుకునే అర్హత ఎక్కడ ఉందని వైసీపీ చెప్తోంది. వైసీపీ సమయంలో టీటీడీలోని పదవులు రెడ్డి సామాజికవర్గానికే కట్టబెట్టిందని టీడీపీ విమర్శించింది. పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) చెప్తున్న ప్రకారం సనాతన ధర్మానికి చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులకు చైర్మన్‌ పదవి ఇస్తారా.. లేదా తిరుమల అనగానే గుర్తొచ్చేది సన్నిధిగోలలు.. శ్రీవారితో యాదవులకు సంబంధం ఉంటుంది.. శ్రీవారిని తొలి దర్శనం చేసుకునేది యాదవులు.. ఇలాంటి యాదవులకు పదవి ఇస్తారా.. లేదా తమ సామాజిక వర్గానికి చెందిన ఓ మీడియా అధిపతికి, లేదా ఓ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి టీటీడీ చైర్మన్‌ పదవి కట్టబెడతారా.. 'మీ జర్నలిస్ట్ వై.ఎన్.ఆర్.విశ్లేషణ ఈ వీడియోలో'


Updated On
Eha Tv

Eha Tv

Next Story