ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొనుగోలు(AP Electricity Purchase) ఒప్పందాల అంశానికి సంబంధించి తెలుగుదేశంపార్టీకి(TDP) చెందిన మీడియా రెట్టించిన ఉత్సాహంతో వార్తలు రాస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొనుగోలు(AP Electricity Purchase) ఒప్పందాల అంశానికి సంబంధించి తెలుగుదేశంపార్టీకి(TDP) చెందిన మీడియా రెట్టించిన ఉత్సాహంతో వార్తలు రాస్తున్నది. ఎందుకంత ఉత్సాహం అంటే ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ఈ వ్యవహారంలో లంచాలు(Corruption) తీసుకున్నారనే ఆ మీడియాకు అందిన వార్త. అమెరికాలోని ఓ రిపోర్ట్‌(Report) ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఆఫీసర్‌కు ముడుపులు అందాయి అన్నదాన్ని బేస్‌ చేసుకుని మీడియా రకరకాల కథనాలను వండుతున్నది. ఆ ఆఫీసర్‌ ఎవరో కాదు, జగన్మోహన్‌రెడ్డినే అంటూ టీడీపీ అనుకూల మీడియా వార్తలు రాస్తున్నది. బివేర్‌ ఆఫ్‌ తెలుగుదేశంపార్టీ(Deaware of TDP) అనుకూల మీడియా! ఎందుకంటే ఈ మీడియా ఓ తప్పుడు ప్రచారాన్ని, ఓ తప్పుడు ఎజెండాను ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నష్టం తెస్తున్నది. ఇలా చేయడం ఆ మీడియాకు కొత్తేమీ కాదు. అనేక సందర్భాలలో అది ఇలాగే చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లపైన తీవ్రమైన దుష్ప్రచారం చేస్తున్నారని, కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లు(Volunteer) ఉండరని చెబుతున్నారని, కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇంతకంటే మెరుగైన జీవితాలు ఉంటాయని టీడీపీ అనుకూల మీడియా చెప్పుకొచ్చింది. ఆ మీడియా చెప్పేది నిజం కాదని సీనియర్‌ జర్నలిస్టులందరికీ తెలుసు. అన్నట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ లేకుండా పోయింది. టీడీపీ అనుకూల మీడియా చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది. అలాగే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ విషయంలో కూడా అంతే! ఆ యాక్ట్‌పై మీడియా అనేక రాతలు రాసింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగానే కూటమి సర్కారు విజయం సాధించగలిగింది. ఇప్పుడు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టే మరో రూపాన్నిసంతరించుకుని ప్రజల ముందుకు వచ్చింది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ కారణంగా ప్రజలకు వచ్చే నష్టమేమీ లేదని ఆనాడు మేము చెప్పాం. ఇప్పుడు అదే నిజమయ్యింది. ఆ యాక్ట్‌ మరో రూపంలో వచ్చిందే తప్ప మొదటిదానికి రెండో దానికి పెద్ద తేడా ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మోటార్లకు మీటర్లు పెట్టాలని జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మీడియా గాయ్‌ గత్తర చేసింది. ఈ రాతలు టీడీపీ మేలు కోరి రాసినవే తప్ప దీని వల్ల ప్రజలకు ఒనగూడే ప్రయోజనం పిసరంత కూడా లేదు. ఇప్పుడు కూటమి సర్కార్‌ కూడా మోటార్లకు మీటర్లను సమర్థిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విద్యుత్‌ కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిపోయిందటూ రెండు లక్షల కోట్ల రూపాయలను జగన్మోహన్‌రెడ్డి సర్కారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నెత్తిన పెట్టేసిందని ఓ పెద్ద దిన పత్రిక, ఓ పెద్ద జర్నలిస్టు రాసేస్తున్నారు. ఏమిటా నష్టం? అంటే ఏమీ లేదు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారే ఉంది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పవర్‌కు సంబంధించి 133 పవర్‌ పర్చస్‌ అగ్రిమెంట్లను చేసుకుంది. ఇందులో విండ్‌ పవర్‌కు సంబంధించి 4.62 పైసలకు ఓ యూనిట్‌ను కొనుగోలు చేసింది ప్రభుత్వం. అలాగే సోలార్‌ పవర్‌ను సగటున 5.90 పైసలకు యూనిట్‌ చొప్పున కొనుగోలు చేసింది చంద్రబాబునాయుడు ప్రభుత్వం. వీటిని రద్దు చేస్తూ తర్వాత వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సెకీతో ఒప్పందం చేసుకుంది. ఏమిటా ఒప్పందం అంటే సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పలు రాష్ట్రాలకు సోలార్‌ పవర్‌ను అమ్ముతుంటుంది. దేశంలో ఈ పవర్‌ను ఉత్పత్తి చేసే సంస్థల నుంచి సెకీ టెండర్లను స్వీకరించింది. ఈ విధంగా సోలార్‌ పవర్‌ను, విండ్‌ పవర్‌ కాంట్రాక్టు అదానీకి లభించింది. అదానీ నుంచి సెకీ వపర్‌ను తీసుకుని దానిని రాష్ట్రాలకు అమ్ముతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2.49 పైసలకు యూనిట్‌ చొప్పున కొనుగోలు చేసింది. చంద్రబాబు 5.90 పైసలకు యూనిట్‌ కొంటే తప్పు కాదు కానీ, జగన్ 2.49 పైసలకు కొంటే తప్పొచ్చి పడింది..

Updated On 29 Nov 2024 7:33 AM GMT
Eha Tv

Eha Tv

Next Story