టీటీడీ చైర్మన్‌(TTD Chairman) విషయంలో లోకేష్‌(Nara Lokesh) మాటే నెగ్గింది.

టీటీడీ చైర్మన్‌(TTD Chairman) విషయంలో లోకేష్‌(Nara Lokesh) మాటే నెగ్గింది. టీటీడీ చైర్మన్‌గా టీవీ5 చైర్మన్‌(TV5) బి.ఆర్‌.నాయుడిని(BR Naidu) కూటమి సర్కార్‌ నియమించింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బి.ఆర్.నాయుడు పేరు వినిపిస్తోంది. బీఆర్‌నాయుడు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావడం కూడా ఒక అడ్వాంటేజ్. రెండు నెలల క్రితమే ఆయనను చైర్మన్‌గా నియమిస్తారని వార్తలు వచ్చాయి. లడ్డూ వివాదం(Laddu Controversy) రావడంతో దీనికి కొంత బ్రేక్‌ పడింది. పలు కారణాలతో టీటీడీ చైర్మన్‌ నియామకం ఆగిపోయిందని సమాచారం. బీఆర్‌నాయుడు నియామకాన్ని టీడీపీకి మద్దతు తెలిపే కొన్ని చానెళ్ల మీడియా ప్రముఖులు అడ్డుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. గత ఐదేళ్లుగా టీడీపీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లిందని నారా లోకేష్ నమ్మారు. ఈ కారణంగానే బీఆర్‌ నాయుడు నియామకాన్ని ఎంత మంది అడ్డుకున్నాకానీ నారా లోకేష్‌ తలొగ్గకుండా ఆయనకే మద్దతు తెలిపారు. సో టీటీడీ చైర్మన్‌ నియామకంలో నారా లోకేష్‌ పంతమే నెగ్గిందని సమాచారం. టీటీడీ చైర్మన్‌ నియామకంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!


Updated On
Eha Tv

Eha Tv

Next Story