Journalist YNR : మరుగుజ్జు పలుకులు.. ఆంధ్రజ్యోతిని ఏకిపారేసిన వైఎన్ఆర్
ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు గురించి కాస్త మాట్లాడదాం అనిపించింది. ఆయన ఈరోజు రాసిన రాతలు చూసిన తర్వాత కోపం వస్తుంది.

ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు గురించి కాస్త మాట్లాడదాం అనిపించింది. ఆయన ఈరోజు రాసిన రాతలు చూసిన తర్వాత కోపం వస్తుంది. ఆర్టికల్ మొదట్లో తెలంగాణ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ జాగీరా అని ఆయన అన్నారు. ఏ ప్రాంతమైనా ఏ పార్టీకి జాగీరుగా ఉండదు.. ప్రజలు ఎవరికీ ఓట్లు వేస్తే వాళ్లు అధికారంలోకి వచ్చి పరిపాలిస్తారు. అంతే జాగీర్లు అని రాసుకోవడానికి ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాం.. జాగీర్లు ఉండవు సో ఈయన తొలి పలుకులు ఏంటంటే ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ అయితే.. కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అని మహా ప్రస్థానం పుస్తకానికి రాసిన యోగ్యతా పత్రంలో చలం వ్యాఖ్యానించారంట. సో మొత్తం తెలంగాణ బాధ కేసీఆర్ బాధ అవునో కాదో నాకు తెలియదు కానీ.. చంద్రబాబు బాధ మాత్రం ప్రపంచం మొత్తం బాధ అనేది మీ ఉద్దేశం. మీ రాతలు, మీ పనులు, మీ కార్యక్రమాలు అన్ని అదే విధంగా ఉంటాయి, చంద్రబాబు బాధ మొత్తం ప్రపంచం బాధ అన్నట్టుగా ఉంటుంది, సో ఈయన ఈ రాసిన ఆర్టికల్ ఉద్దేశం ఇటీవల తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు, తెలంగాణ ప్రాంతంలో ఉండి, తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న కొన్ని మీడియా ఛానల్ గురించి వాటిని ఆంధ్ర మీడియా అంటూ ప్రస్తావిస్తూ అవి స్లాటర్ హౌసులుగా మారిపోయాయి. ఇప్పటి వరకు జరిగినవి దాడులు కాదు దాడులు ఏంటో మేము చూపిస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి అంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు, ఈ వార్నింగ్ రాధాకృష్ణకి చాలా కోపం తెప్పించింది, ఆ కోపంలో ఏం రాస్తున్నారో అర్థం కాకుండా రాశారు. ఆయన అస్తవ్యస్తంగా రాశారు ఈయన ఆర్టికల్ ఇంత అసమగ్రంగా ఇంత కన్ఫ్యూజన్ గా ఉండడం, నేను ఎప్పుడూ చూడలే, ఏదో ఒక ఎజెండా పెట్టుకొని ఆ ఎజెండాతో రాసుకుంటూ పోతారు, దీంట్లోనేమో రకరకాల ఎజెండాలు కనపడుతున్నాయి, దీంట్లో ఆయన రాశారు శ్రీకృష్ణ కమిటీ చెప్పింది ఆంధ్రజ్యోతి పత్రికను మూసేస్తే తెలంగాణ ఉద్యమం ఉండదని చెప్పిందంటారు, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళంతా ఈ భూమే బ్రతికి ఉన్నారు ఇంకా తెలంగాణ సమాజంలో ఉన్నారు, వాళ్ళంతా కాస్త నవ్వుతారనే ఇంగితం ఉండిండాలి కదా. ఆంధ్రజ్యోతి పత్రిక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిందా, ఆంధ్రజ్యోతి పత్రికను ఆపేస్తే తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందా ఆ మాట శ్రీకృష్ణ కమిటీ చెప్పిందా, ఏం చెప్పింది శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రజ్యోతి లాంటి రెచ్చగొట్టే పత్రికల్ని మూసేస్తే తెలంగాణ ఉద్యమం ఉండదని చెప్పిందేమో. ఇదే ఆర్టికల్ చివర్లో మళ్లీ మీరు రాశారు ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు దాడులు చేస్తే కూడా ఆంధ్రజ్యోతి భయపడలేదని, తెలంగాణ ఉద్యమం కోసం నువ్వు పని చేస్తే ఉద్యమకారులు దాడులు చేయడం ఏంటి, నీ పైన బీఆర్ఎస్ దాడులు చేసిందని రాయలా, నువ్వు రాసిన వర్డ్ ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు దాడులు చేస్తే కూడా ఆంజ్యోతి భయపడలేదు అని రాశావు. తెలంగాణ ఉద్యమం ఆగిపోవాలంటే శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రజ్యోతిని మూసేయమంది అని రాశావు. తెలంగాణ ఉద్యమాన్ని అంత ఉదృతంగా నడిపిస్తున్న ఆంధ్రజ్యోతి కార్యాలయం పైన తెలంగాణ వాదులు దాడులు ఎందుకు చేశారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు YNR విశ్లేషణ..!
