బీహార్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చాలా ఆసక్తిని కలిగించిన అంశం ప్రశాంత్ కిషోర్.

బీహార్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చాలా ఆసక్తిని కలిగించిన అంశం ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ఈ దేశంలో ప్రధానిగా మోదీ ఉండడానికి నేనే కారణం, ప్రధాని మోదీకి నేనే డిజిటల్ కాంపెయినర్ గా పని చేశాను, స్ట్రాటజిస్ట్ గా పని చేశాను అని చెప్తూ వచ్చారు. నితీష్ కుమార్‌ని ముఖ్యమంత్రిని చేసింది నేనే అని చెప్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే అని చెప్తూ వచ్చారు. స్టాలిన్‌ని ముఖ్యమంత్రిని చేసింది నేనే, మమతా బెనర్జీని ముఖ్యమంత్రిని చేసింది నేనే అని చెప్తూ వచ్చారు. ఉత్తరప్రదేష్‌లో కాంగ్రెస్ సమాజవాదీని అధికారంలోకి తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా మారిపోయారు, జన్ సురాజ్ అనే ఒక పార్టీ ఏర్పాటు చేశారు.

బీహార్ అంతా పాదయాత్ర చేశారు, బీహార్ యువత కోసం మాట్లాడారు, బీహార్ యువత ఆత్మగౌరవం గురించి మాట్లాడారు, కాంగ్రెస్- భారతీయ జనతా పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయి అంటూ మాట్లాడారు. జనసురాజ్ పార్టీ రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్తూ వచ్చారు. ఇన్ని చెప్తూ వచ్చి బీహార్‌లో తేజస్వి యాదవ్‌ని టార్గెట్ చేస్తూ ఎన్నికల ముందంతా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. తేజస్వి యాదవ్‌ని ఓడిస్తానంటూ ప్రకటన చేస్తూ వచ్చారు. తేజస్వి యాదవ్ పైన పోటీ చేస్తాననే ప్రకటన కూడా ఆయన చేయడం చూశాం. అటువంటి ప్రశాంత్ కిషోర్ బీహార్ రాష్ట్రంలో చతికలబడిపోయారు. ఎన్నికలు దగ్గరికి వచ్చే సమయానికి, ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదనే ప్రకటన చేశారు. ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తాను, అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న తేజస్విని ఓడిస్తాను అని చెప్పిన ప్రశాంత్ కిషోర్, ఎన్నికల సమయం దగ్గరపడేనాటికి ఎన్నికల్లో తను పోటీ చేయట్లేదు. తను బయట నుండి పార్టీ వ్యవహారాలన్నీ చూస్తాను అని చెప్తూ రావడం చూశాం.

ప్రశాంత్ కిషోర్ కి ఓటమికి సంబంధించిన వ్యవహారం పైన అప్పటికే క్లారిటీ వచ్చింది అనే విషయం కూడా అర్థమైంది. కేజ్రీవాల్‌ తరహాలో తాను బీహార్ రాజకీయాలని మార్చేస్తాను, ఢిల్లీలో కేజ్రీవాల్‌ ఏ రకంగా సక్సెస్ అయ్యారో, అదే సక్సెస్ ఫార్ములాని బీహార్ లోనూ ఇంప్లిమెంట్ చేస్తామంటూ ప్రశాంత్ కిషోర్ చెప్తూ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చారు. రాజకీయ పార్టీలపైన దేశానికి నాయకత్వం వహిస్తున్న నాయకుల పైన బీహార్ కు నాయకత్వం వహిస్తున్న నాయకుల పైన, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఎన్నికల సమయానికి తేలిపోయారు, ఎన్నికల సమయానికి పోటీ అంటే భయపడ్డారు, పోటీ చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయమే, ఆయన అక్కడ ఆయనకంత సీన్ లేదనే విషయానికి అనే విషయాన్ని మనకు స్పష్టం చేసింది. ప్రశాంత్ కిషోర్ గెలవబోతున్న పార్టీల పక్కన నిలబడి జెండా ఊపి, ఆ విజయానికి తానే కారణమని చెప్పుకున్నారు ఇంతకాలం తప్ప, ఆయన ఆ పార్టీలను గెలిపించలేరు అని అనుకోవడానికి ఆస్కారం ఇచ్చింది. బండి కింద నడుస్తున్న ఒక కుక్క ఆ బండిని తాను మోస్తున్నానని ఏ రకంగా చెప్పుకుంటుందో, గెలుస్తున్న పార్టీల సరసన చేరి, ఆ పార్టీలను తానే గెలిపించాను అని ప్రశాంత్ కిషోర్ ఇంతకాలం చెప్పుకున్నారు అని అనుకోవడానికి ఒక ఆస్కారం ఇచ్చింది ప్రశాంత్ కిషోర్ వ్యవహారం.సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story