JubleeHills By Election: జూబ్లీహిల్స్ ఎన్నికలో హైడ్రా కీలక పాత్ర..!
JubleeHills By Election: జూబ్లీహిల్స్ ఎన్నికలో హైడ్రా కీలక పాత్ర..!
హైదరాబాద్‌లో త్వరలో ఒక అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగబోతుంది, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజక వర్గానికి, జరిగే ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకునే పరిస్థితి ఉంటుంది. గతంలో పదవిలో ఉండగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సందర్భంలో , ఆ స్థానంలో ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉండేవాళ్ళు కాదు, ఎవరైతే అభ్యర్థి మరణించారో వాళ్ళ కుటుంబ సభ్యులకే ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేసేలాగా గతంలో సాంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో ఉండేది. సో ఆ సాంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బ్రేక్ చేశారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎమ్మెల్యేలు మరణించిన స్థానాల్లో ఉపఎన్నికలు జరిగిన సందర్భంగా పోటీ జరుగుతూ వచ్చింది. సో తాజాగా జూబ్లీ హిల్స్ శాసన సభ్యుడిగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగడం అనివార్యంగా కనపడుతుంది. సో ఈ అనివార్యంగా జరిగే ఉప ఎన్నికలో గెలవడానికి సంబంధించి మూడు ప్రధాన పార్టీలు కూడా చాలా ఫోకస్డ్ గా ఉన్నాయి, గెలవడానికి సంబంధించిన సర్వశక్తులు వడ్డేందుకు రెడీ అవుతున్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి కూడా పట్టుఉంటుంది, బిఆర్ఎస్ పార్టీ గడిచిన ఎన్నికలో ఆ స్థానంలో విజయం సాధించింది, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, ఆ స్థానంలో గెలవడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా ప్రయత్నం చేస్తుంది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజక వర్గానికి 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ మూడు సార్లు వరసగా విజయం సాధించారు. సో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నిక బిఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికగా కనబడుతుంది, ఎందుకంటే తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం బిఆర్ఎస్ పార్టీకి ఉంది, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఫెయిల్ అయిపోయింది, అని భావిస్తుంది, ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ గ్యారెంటీగా అధికారంలోకి వస్తుందని నమ్ముతుంది. అటువంటి సందర్భంలో తమ సొంత స్థానాన్ని, తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడం అనేది బిఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ స్థానాన్ని గెలవడానికి సంబంధించి, బిఆర్ఎస్ పార్టీ చాలా ఫోకస్డ్ గా కనపడుతుంది, మాగంటి గోపీనాథ్ సతిమణిని భరిలోకి దించాలనే నిర్ణయం తీసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టలేదు, ఒక్క సీటు కూడా ఈ పరిధిలో ఇవ్వని పరిస్థితి చూశారు. సో ఇప్పుడు రెండేళ్ల పాలన ఆల్మోస్ట్ పూర్తి అవుతున్న నేపథ్యంలో తమ పాలన బాగుంది అని ప్రజల దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకునే అవకాశం జూలీ హిల్స్ ఉప ఎన్నిక, ఈ ఉప ఎన్నికల గనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని మరోసారి రూఢీ అయినట్లు అవుతుంది. కాబట్టి ఈ స్థానాన్ని గెలవడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ జరుగుతున్నది కేవలం ప్రచారం మాత్రమే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన, కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఈ ఎన్నికలో ప్రధాన పార్టీల వ్యూహాలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
