బిఆర్ఎస్ పార్టీలో ఇక కవిత వ్యవహారం ముగిసిన అధ్యయంగా మారిపోయింది. బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి , బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు.

బిఆర్ఎస్ పార్టీలో ఇక కవిత వ్యవహారం ముగిసిన అధ్యయంగా మారిపోయింది. బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి , బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సందర్భంగా నిన్న పార్టీ ఆమెను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం పైన కవిత ఈరోజు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. కవిత మాట్లాడిన మాటలు చూసిన తర్వాత, ఆమె గత 102 రోజులుగా మాట్లాడుతున్న మాటలకు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కి చాలా స్పష్టమైన తేడా కనబడింది, ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె తన అన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, తన తండ్రి పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కి ,అపీల్ చేశారు. వాళ్ళ పట్ల విధేయతను ప్రకటించారు, వాళ్ళపైన నమ్మకాన్ని ప్రకటించారు, వాళ్ళకు నష్టం జరుగుతోంది అంటూ చెప్తూ వచ్చారు, 102 రోజుల క్రితం ఆమె పార్టీపై తిరుగు బావుట ఎగరేసిన తరహాలో మాట్లాడిన రోజు మాట్లాడిన మాటలకి, ఈరోజు ఆమె మాట్లాడిన మాటలకి చాలా వ్యత్యాసం కనపడుతుంది. మొదటిగా ఆమె పార్టీ అధినేతకు రాసిన లేఖ లీక్ అయిన సందర్భంగా మాట్లాడిన మాటలు కెసిఆర్ మంచోడే చుట్టూ దెయ్యాలు ఉన్నారు అంటూ మాట్లాడారు.

అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ లో, ఆమె మాట్లాడిన మాటలవి, ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆమె మాట్లాడిన మాటలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టార్గెట్ చేసినట్లుగా స్పష్టంగా కనపడ్డాయి. పార్టీ సరిగ్గా యాక్ట్ చేయలేకపోతుంది, పార్టీ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోతుంది తరహాలో, ఆమె మాట్లాడుతూ వచ్చారు, ఆమె మాట్లాడుతున్న మాటలన్నీ కేటీఆర్ ని టార్గెట్ చేసి ఉన్న మాటలుగా కనపడ్డాయి, రెండు రోజుల క్రితం ఆమె హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ, వాళ్లిద్దరి కారణంగా కేసిఆర్ కి అప్రతిష్ట వస్తోంది, వాళ్ళిద్దరే బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారు, వాళ్లిద్దరే కాళేశ్వరంలో జరిగిన అవినీతికి బాధ్యులు అంటూ ఆమె ప్రకటన చేశారు. ఇది బిఆర్ఎస్ పార్టీకి కోపం తెప్పించింది, ఆ ఇద్దరే దెయ్యాలు అనే ఒక ఇంప్రెషన్ వచ్చేలా కవిత మాట్లాడారు, ఆ కవిత ఆ మాటల తర్వాత మొత్తం బిఆర్ఎస్ పార్టీ అంతా హరీష్ కి అండగా నిలుస్తూ వచ్చింది. కవిత వ్యాఖ్యలు తప్పు లాంటి ఒక ఇంప్రెషన్ పార్టీ ఇస్తూ వచ్చింది, నిన్న సస్పెండ్ చేసింది, సో ఈరోజు ఆమె మాట్లాడిన మాటలు చూసినప్పుడు గతంలో మాట్లాడిన దానికి భిన్నంగా కేటీఆర్ పైన ప్రేమను చూపించారు, కేటీఆర్ కి కూడా తెలియకుండా పార్టీలో చాలా జరుగుతున్నాయి అనే విషయాన్ని చెప్పారు.

కేటీఆర్ ని కూడా పార్టీ నుంచి బయటికి పంపించే కుట్ర జరగబోతుంది అంటున్నారు. కేసిఆర్ నుంచి పార్టీని లాక్కునే ప్రయత్నం జరుగుతుంది, అంటూ కొన్ని సంచలన ఆరోపణలను కూడా ఆమె చేస్తున్నారు, కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, వాళ్ళ వల్ల నష్టం జరుగుతోంది అంటూ కవిత చెప్పుకొచ్చారు. సో కవిత వ్యవహారం చూసిన తర్వాత, కవిత మాటలు చూసిన తర్వాత, ఈరోజు నాచురల్ గా కేటీఆర్ ని టార్గెట్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె చాలా ఎమోషనల్ గా, చాలా ఎమోషనల్ గా , బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులకు సంబంధించిన మద్దతును పొందే ప్రయత్నం ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చేసినట్లు కనపడింది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


ehatv

ehatv

Next Story