తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతిసారి జరిగే చర్చ ఈసారి కూడా జరుగుతుంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతిసారి జరిగే చర్చ ఈసారి కూడా జరుగుతుంది. కేసీఆర్ సభకు వస్తారా, రారా, కేసీఆర్ సభకి రాకపోతే పరిస్థితి ఏంటి, వస్తే పరిస్థితి ఏంటి, ఇలాంటి చర్చ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. అయితే ఈసారి సమావేశాలకు కేసీఆర్ అటెండ్ కాబోతున్నారు అంటూ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే ప్రకటించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు, కేసీఆర్ అసెంబ్లీకి గతంలోనే వచ్చారు, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా, ఎన్నికల సందర్భంగా, ఎమ్మెల్సీ కి సంబంధించిన ఎన్నికల సందర్భంగా, ఒకటి, రెండు సందర్భాల్లో ఆయన అసెంబ్లీకి వచ్చినప్పటికీ, అసెంబ్లీలో కేవలం అటెండ్ అయ్యి వెళ్ళిపోయారు. కేవలం అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చినట్లుగా కనపడింది. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదనే అధికార పార్టీ వైపు నుంచి వస్తున్న విమర్శకు ప్రశ్నకు, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట సభలో, ఉన్న మమ్మల్నే ఎదుర్కోలేకపోతున్నారు ఇంక మీకు కేసీఆర్ అవసరమా అంటూ మాట్లాడడం చూస్తూ వచ్చాం. కేసీఆర్ లేకపోయినా, కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రజల సమస్యలపైన నిలదీయగల నాయకత్వం మాకు ఉంది, మేము అడిగిన ప్రశ్నలకే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది, మీకు కేసీఆర్ అవసరం లేదు తరహాలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ రావడం చూశాం.

ఈ నేపథ్యంలో ఆయన టెక్నికల్ ఇష్యూస్ రాకుండానో లేకపోతే కారణం ఏంటో తెలియదు కానీ, కేవలం అటెండ్ అయి వెళ్ళిపోతున్నారు, రెండేళ్ళ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి, ఈ రెండేళ్ల కాలంలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రసంగం లేదు. ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీలో కేసీఆర్ ఏదైనా చర్చలో పార్టిసిపేట్ చేసింది లేదు. ఈ రెండేళ్ల కాలంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు. అసెంబ్లీలో కేసీఆర్ లేని సమయంలో కేసీఆర్ కాకుండా హరీష్ రావు, కేటీఆర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, చర్చల్లో పార్టిసిపేట్ చేయడం ప్రధానంగా చూస్తూ వస్తున్నాం. ఈసారి పరిస్థితి ఏంటి ఈసారి కొద్ది రోజుల క్రితం కేసీఆర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రెండు సంవత్సరాల సమయం ప్రభుత్వానికి ఇచ్చాం, ఇక సమయం ముగిసిపోయింది, ఇక మేమేంటో చూస్తాం, చూపిస్తాం ప్రజల్లోకి వస్తాం, ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి నేపధ్యంలో, ప్రభుత్వం తోలు తీస్తామంటూ కేసీఆర్ మాట్లాడడం చూశాం. నేను ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక నేను ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను, ఎటాక్ చేయబోతున్నాను అంటూ నేరుగా కేసీఆర్ఏ స్వయంగా ప్రకటించడం చూశాం. కేసీఆర్ ఆ ప్రకటన చేసిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఈ సమావేశాలకు కేసీఆర్ కేవలం అటెండెన్స్ చేయించుకొని వెళ్తారా, ప్రభుత్వం పైన ఎటాక్ చేస్తారా అనేది ఆసక్తి కలిగిస్తుంది. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మరణించిన నేపథ్యంలో ఆయనకి సంబంధించిన సంతాప తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత బీఏసీలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. KCR అసెంబ్లీకి హాజరుకాడంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story