ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితికి సంబంధించిన చర్చ గడిచిన ఐదేళ్ల కాలంలో చూశాం. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు బాలేవు రోడ్లు గుంతలు పడిపోయాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితికి సంబంధించిన చర్చ గడిచిన ఐదేళ్ల కాలంలో చూశాం. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు బాలేవు రోడ్లు గుంతలు పడిపోయాయి. అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం చూశాం. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు బాగా లేక, రోడ్లు బాగా లేక, ప్రజలు ఇబ్బందులు పడడం కూడా చూశాం. ప్రధానంగా గుంటూరు నుంచి ఇటుపైకి గోదావరి జిల్లాలో ఎక్కువగా రోడ్లు పాడవుతూ ఉంటాయి, ఎక్కడన్నా సాయిల్ కారణంగా రోడ్లు ప్రతి సంవత్సరం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా రోడ్లు బాగా లేక గత ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకత పెంచుకోవడానికి, రోడ్లు బాగా లేకపోవడం కూడా ఒక కారణం. దాన్ని చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. ఈ ప్రభుత్వం రోడ్లు కూడా వేయలేకపోతుంది. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులన్నిటిని పనిచేస్తోంది, పప్పు బెల్లాలులాగా అంటూ అప్పుడు ప్రతిపక్షాలు విమర్శించాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లన్నీ అద్దాంలా మారిపోయాయి అని చెప్తుంది. చాలా సందర్భాల్లో, చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న గుంతలుగా ఉన్న చోట్ల ఆ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. వర్షాకాలంలో అటువంటి గుంతలు పూర్చడం ద్వారా ప్రజలకు సంబంధించిన ఇబ్బందులని చాలా వరకు తొలగించింది కూటమి సర్కారు. ఆ తర్వాత ఫార్మేషన్ రోడ్ల పేరుతో, లింక్ రోడ్ల పేరుతో కొన్ని రోడ్లకు సంబంధించి నిధులు మంజూరు చేశారు. కొన్ని రోడ్లు పూర్తవుతున్నాయి, కొన్ని రోడ్లకు సంబంధించింది టెండర్లు పిలిచాం, కొన్ని రోడ్లు ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయని ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రహదారులు విస్తరణపైన, రాష్ట్ర రహదారులు ఫార్మేషన్ పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది.

రాష్ట్ర రహదారులు 1500 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆర్‌ అండ్‌ డీ డిపార్ట్మెంట్ ద్వారా అని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర రహదారుల నిర్మాణానికి సంబంధించి, రాష్ట్ర రహదారుల రిపేర్ కు సంబంధించి డబ్బులు దాదాపు 22 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనాలు వేసింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్‌ అండ్‌ డీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా, ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఎంత రోడ్లు వేయాలి, ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు ఏంటి, ఏ రకంగా రోడ్లు వేయాలి అనే దాని పైన ఒక చర్చ జరిగిందట. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ, ఆ చర్చ ఏం జరిగింది అనేది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధాన పత్రికల్లో, పతాక శీర్షికల్లో వచ్చింది. రోడ్లపైన సెస్ వేయబోతున్నారు అని, రోడ్లపైన సెస్ వేయబోతున్నారు లాంటి, ఒక వార్తని ప్రభుత్వం అధికారికంగా లీక్ ఇచ్చి రాయించింది, అంటే దాని అర్థం ప్రజలు ఏమనుకుంటున్నారో, తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే, ఓకే యక్సెప్టెన్సీ వచ్చినట్టే అని ప్రభుత్వం భావిస్తుంది. ప్రజలు రివర్స్ అవ్వకపోతే, ప్రజలు చైతన్యం అవ్వకపోతే, ప్రజలు ప్రశ్నించకపోతే, ప్రభుత్వం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా మొత్తం రాష్ట్ర రహదారులని అమ్మేయబోతుంది. అమ్మేయబోతుంది అనే మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, ప్రైవేట్ వ్యక్తులే రోడ్లు నిర్మించి వాళ్ళే ఆ తర్వాత టోలు వసూలు చేసుకుంటారు, టోలు వసూలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు రోడ్లుగానే చూడాలి, ఎంతకాలమైనా వాళ్ళకు ప్రభుత్వం తాకట్టు పెడుతున్నట్టు దానికంటే అమ్మేస్తున్నట్టుగానే చూడాలేమో, ప్రభుత్వం నిధుల సమీకరణ ఎలా చేస్తుందంట అంటే 4000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది, మిగతా నిధులన్నీ సమీకరణ చేస్తుంది, ఈ 4వేల కోట్ల రూపాయలు కూడా ఎలా తీసుకురావాలి ఏంటి అనే దాని పైన ఇంకా ఆర్ అండ్‌ బీ శాఖ దృష్టి పెడుతుందట. రోడ్ల అమ్మకాలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story