Kolikapudi Srinivas Rao : కేశినేని చిన్నిపై కొలికపూడి శ్రీనివాస్‌రావు విమర్శలు.. చిన్ని బుక్కయ్యాడా..!
తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న లోకలుకలు బయటపడేలా చేసింది

తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న లోకలుకలు బయటపడేలా చేసింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య వివాదం చాలా రోజులుగా నడుస్తోంది. కొలికపూడి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో పార్టీ కార్యక్రమాల్లోనూ, అక్కడ నియోజక వర్గానికి సంబంధించిన పనుల్లోనూ కేశినేని చిన్ని పెత్తనం ఎక్కువైంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలికపూడి శ్రీనివాస్ గత కొద్ది రోజులుగా నియోజక వర్గంలో తనకు తెలియకుండా పార్టీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. తనకు తెలియకుండా పార్టీ పదవులు ఇస్తున్నారు, పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా, బయట నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. పార్టీ ప్రయోజనాల కోణంలో కాకుండా, ఎంపీ వ్యక్తిగత ప్రయోజనాల కోణంలో పదవులు ఇస్తున్నారు లాంటి ఆరోపణలను కొలికపూడి శ్రీనివాస్ ఇంటర్నల్ గా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయన పార్టీకి సంబంధించిన కార్యకరతో మాట్లాడుతున్న సందర్భంగా కూడా అటువంటి వ్యాఖ్యలు చేయడం చూసాం ఇటివల ఒక వీడియో ఆయంది బయటికి వచ్చింది కొలికపూడి శ్రీనివాసుకి సంబంధించిన వీడియో, గతంలో ఈ నియోజక వర్గంలో పార్టీ పదవుల కోసం కూడా పార్టీ నాయకత్వం వచ్చి ఎన్నికలు పెట్టి సమర్ధులైన నాయకుడు ఎవరో, అక్కడ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకొని పదవులు ఇచ్చేవాళ్ళు, కానీ ఈరోజు ఇప్పుడు మాత్రం ఎంపీ కార్యాలయంలో కూర్చొని పదవులు ఎవరికి, ఏం కావాలో రాసేస్తున్నారు. ఇది సరైంది కాదు పార్టీకి, అంటూ కొలికపుడి మాట్లాడడం చూస్తున్నాం.
కొలికపుడి ఆ నియోజక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గా ఉండి, తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా కేశినేని చిన్ని తిరువూరు నియోజక వర్గంలో పదే పదే వేలు పెట్టి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలని, ఎమ్మెల్యే ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా పార్టీ అధిష్టానం మాత్రం చిన్నిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు లాంటి ఇంప్రెషన్ పార్టీలో వ్యక్తమవుతుంది. నిజానికి శాసనసభ్యులే ఆయా నియోజక వర్గాల్లో సుప్రీం గా ఉంటారు, రీజినల్ పార్టీలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కూడా నియోజక వర్గానికి సంబంధించిన ఇంచార్జే, ఆయన ఆధ్వర్యంలోనే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంపీలకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకోవడానికి పరిమితం అవుతుంటుంది. చాలా చోట్ల అదే జరుగుతూ ఉంటుంది, కానీ తిరువూరులో వచ్చేసరికి మిగతా నియోజక వర్గాలను పక్కన పెట్టి, పర్టికులర్ గా తిరువూరులో కొలికపూడిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో అక్కడ ఎంపీ బిహేవ్ చేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


