జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్‌పైన ఎటాక్ మొదలు పెట్టింది.

జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్‌పైన ఎటాక్ మొదలు పెట్టింది. బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీపైన రాజకీయంగా ఎటాక్ చేయడం వేరే కానీ, గడిచిన కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ అంశం గురించి అయితే, భారతీయ జనతా పార్టీని అటాక్ చేస్తుందో, ఏ అంశాన్ని చూపించి, భారతీయ జనతా పార్టీ తప్పు చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్తుంది అని మాట్లాడుతుందో, ఏ అంశాన్ని చూపించి ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తుంది అని రోజు చెప్తూ వస్తుందో, అదే అంశాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పైన బిఆర్ఎస్ పార్టీ ప్రయోగించింది. బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రైజ్ చేసిన అంశాలన్నీ ఇటీవల కొద్ది రోజుల క్రితం, ఢిల్లీ కేంద్రంగా రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టించిన, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల తరహాలోనే ఉన్నాయి. దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతోంది భారతీయ జనతా పార్టీ, తమకు ఓటు వేయరు అనుకున్న వాళ్ళ ఓట్లను తొలగించేస్తుంది, ఓట్ల తొలగింపునకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తో సంబంధం లేకుండా, ప్రైవేట్ వ్యక్తుల మెయిల్స్ నుంచి, ప్రైవేట్ వ్యక్తుల ఐడిస్ నుంచి ఓట్ల తొలగింపు జరుగుతోంది అంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతూ వచ్చారు. కొన్ని నియోజక వర్గాల్లో, అడిషనల్ గా ఓట్లను జాయిన్ చేశారు, ఆ కొత్తగా చేర్పించిన ఓట్లు, భారతీయ జనతా పార్టీకి మాత్రమే పడుతున్నాయి, ఇదిగో దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అంటూ రాహుల్ గాంధీ మాట్లాడడం చూశాం.

తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో, జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో ఒకే ఇంట్లో 40 ఓట్లు, 50 ఓట్లు, ఒక ఇంట్లో 120 ఓట్లు కూడా ఉన్నాయి, ఆ ఇంటి దగ్గరికి వెళ్లి చూస్తే ఆ ఇంట్లో అంతమంది నివసిస్తున్న దాఖలాలు లేవు, ఆ ఇంటి పేరుతో అన్ని ఓట్లు ఉన్నాయా అనే విషయం ఆ ఇంటి ఓనర్స్ కి, ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళకి కూడా తెలియదు అంటూ, కొన్ని ఆధారాలతో సహా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న బయట పెట్టారు. బయట పెట్టడం మాత్రమే కాదు, ఆ ఆధారాలని ఎస్‌ఈసీకి ఇప్పటికే సమర్పించారు ఎస్‌ఈసీ ఈ ఆధారాలన్నీ ఇచ్చినప్పటికీ ఎస్‌ఈసీ పట్టించుకోవట్లేదు, ఎస్‌ఈసీకూడా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు చెప్పినట్లే నడుస్తోంది తరహా ఇంప్రెషన్ కలుగుతోంది అంటూ కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ నిన్న బయట పెట్టిన అంశాలపైన, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అఫీషియల్ గా స్పందించలేదు, కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ చేస్తున్న ఈ ఎటాక్ ఆత్మరక్షణలో పడేసింది అని చెప్పాలి, ఎందుకంటే ఓట్ల చోరీ గురించి రోజు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఓట్లు ఒకే ఇంటి పేరుతో ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి చేరాయి, అనే ప్రశ్నకి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ కేటీఆర్ ప్రశ్నిస్తోంది భారతీయ జనతా పార్టీని కాదు, భారతీయ జనతా పార్టీ ఓట్లు చేర్పించే దాంట్లో, భారతీయ జనతా పార్టీ కొత్త ఓట్లని చేర్పించడానికి సంబంధించిన అవకాశము ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇవి జరిగి ఉంటాయని అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


Updated On
ehatv

ehatv

Next Story