Land Title Act: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై కూటమి తలకు చుట్టుకున్న తప్పుడు ప్రచారం..!

తప్పుడు ప్రచారం తేలిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో తప్పుడు ప్రచారం కూటమి తలకు చుట్టుకుంటోంది. ఏంటా తప్పుడు ప్రచారం ఏంటి కూటమికి చుట్టుకుంది. ఎన్నికలకు సరిగ్గా వారం, 10 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల సమయంలో మహా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ, మీడియా మొత్తం, చేసిన ల్యాండ్‌ టైటిల్ యాక్ట్ గురించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ తీసుకొచ్చింది జగన్మోహన్‌రెడ్డి మీ భూమలన్నీ గుంజుకోవడం కోసం, జగన్మోహన్‌రెడ్డి ఫొటో ఉన్న హద్దు రాళ్లను ఇస్తున్నారు, ఆ ఫొటోతో కూడిన రాళ్లు మీ పొలంలో పాతుతారు, అంటే ఆ భూమి అంతా జగన్మోహన్‌రెడ్డిదే అయిపోతుంది, మీ భూమలన్నీ తాకట్టు పెట్టి జగన్మోహన్‌రెడ్డి పేదవాళ్లకు అకౌంట్‌లో డబ్బులు వేయబోతున్నడు, రాష్ట్రాన్ని, సెక్రటేరియెట్‌ను మొత్తం తాకట్టు పెట్టేశాడు, ఇక మిగిలింది మీ భూములు మాత్రమే, వాటిని కూడా స్వాధీనం చేసుకోబోతున్నాడు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చేసిన వీడియో ఇది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల భూములను గుంచుకోవడానికి ఒక రాజముద్రలాంటిది అని క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. పూర్తి విశ్లేషణ..!

Updated On 24 Jan 2026 12:10 PM GMT
ehatv

ehatv

Next Story