LuLu Mall Land: పీఠం భూములు లాక్కున్నారు! లులూకేమో దోచిపెడుతున్నారు?
LuLu Mall Land: పీఠం భూములు లాక్కున్నారు! లులూకేమో దోచిపెడుతున్నారు?
లులూ గ్రూప్‌కి ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం భూములు కేటాయించింది. దీనిపైన వివాదం చూస్తున్నాం ఏంటి, లులూ గ్రూప్‌లు ఒక షాపింగ్ మాల్, హైదరాబాద్‌లో ఉన్న కొన్ని వందల షాపింగ్ మాల్స్ తరహా ఒక షాపింగ్ మాల్, హైదరాబాద్‌లో కూడా లులూగ్రూప్ షాపింగ్ మాల్ ఉంది. లులూ గ్రూప్ ఇప్పటికే తమిళనాడులో, కేరళలో కూడా తమ మాల్స్ ని ఏర్పాటు చేసింది. అటువంటి లులూ గ్రూపు ఆంధ్రప్రదేష్‌కు వచ్చింది, ఆంధ్రప్రదేష్ అదృష్టం అంటూ తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వచ్చింది. గతంలోనే ఆ లులూ గ్రూప్ కి విశాఖపట్నంలో గత టిడిపి సర్కార్ 2014 నుంచి 19 మధ్యలో భూములు ఇస్తే వైసీపీ అధికారులతో వచ్చిన తర్వాత ఆ భూముల్ని రద్దు చేసింది. ఆ తర్వాత లులూ గ్రూప్ వెళ్ళిపోయింది, కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే మళ్ళీ లులూ గ్రూప్‌కి విశాఖపట్నంలో 13 ఎకరాలు, దాదాపు విజయవాడ నడిబొడ్డున నాలుగు ఎకరాలకు పైగా ఆర్టిసి బస్ డిపోకు సంబంధించిన భూమిని కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ భూముల కేటాయింపు పైన ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఇది సరైన విధానం కాదు అని చెప్తున్నాయి. భూములు ఎవరికి ఇస్తారు కంపెనీలకు భూములు ఇస్తారు, ఉద్యోగాల పేరుతో రాష్ట్రానికి సంబంధించిన వెల్త్ పెరుగుతుందనో, కంపెనీలకు భూములు ఇవ్వడం ఇప్పటి వరకు మనం చూశాం. కానీ షాపింగ్ మాల్స్ కి భూములు ఇవ్వడం అనేది ఇప్పటి వరకు మనం ఎక్కడ విననిది, ఎక్కడ చూడనిది, ఈవెన్ లులూ గ్రూప్ కూడా భారతదేశంలో ఒకటి రెండు చోట్ల ఇప్పటికే మాల్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏ రాష్ట్రంలో కూడా లులూ గ్రూప్ కి ప్రభుత్వాలు భూములు ఇచ్చిన పరిస్థితి లేదు. కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, లులూ గ్రూపు తాము వ్యాపారం చేసుకుంటామంటే ప్రభుత్వాలు ఎక్కడ భూములు ఇవ్వలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఇచ్చింది ఆ మాటక వస్తే ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి, మాకు మేము వ్యాపారం చేసుకుంటామంటే, అది కూడా ఒక షాప్ పెట్టుకుంటామంటే, ఒక మాల్ పెట్టుకుంటామంటే భూములు ఇవ్వడం అనేది ఎక్కడా చూడం. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
