ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఒకటి.. తెలంగాణలో ఒకటి మీడియా సంస్థలపైన దాడులు చూశాం. ముందుగా సాక్షి పైన దాడి ఆ తర్వాత.. తాజాగా మహా న్యూస్‌పైన దాడి ఈ రెండు సంఘటనలకు సంబంధించిన రియాక్షన్స్ ఒకసారి చూద్దాం.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఒకటి.. తెలంగాణలో ఒకటి మీడియా సంస్థలపైన దాడులు చూశాం. ముందుగా సాక్షి పైన దాడి ఆ తర్వాత.. తాజాగా మహా న్యూస్‌పైన దాడి ఈ రెండు సంఘటనలకు సంబంధించిన రియాక్షన్స్ ఒకసారి చూద్దాం. ఈ రెండు సంఘటనలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తీసుకున్న డబుల్ స్టాండర్డ్‌ని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌(AP)లో అమరావతి మహిళలకు సంబంధించిన అంశం పైన సాక్షి ఛానల్ డిబేట్‌లో పార్టిసిపేట్ చేసిన ఒక అనలిస్టు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యల్ని మాలాంటి జర్నలిస్టులమందరం ఖండించాం. నిజానికి తెలుగుదేశం పార్టీ(TDP) అక్కడ ప్రభుత్వం ఖండించి కేసులు పెట్టడానికంటే ముందే మాలాంటి వాళ్ళంతా ఆ భాష సరైంది కాదు.. ఆయనపైన చర్యలు తీసుకోవాలి.. ఆయన క్షమాపణలు కోరాలి అంటూ మాట్లాడుతూ వచ్చాం.. సో ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆర్గనైజ్డ్‌గా సాక్షి కార్యాలయాలపైన దాడులకు పాల్పడుతున్న వాళ్లను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం చూపించింది. ఆర్గనైజ్డ్‌గా దాడులు జరిగాయి.. ఇలాంటి ఇంప్రెషన్ కనపడింది తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని వెళ్లి సాక్షి కార్యాలయాలపైన దాడులు చేశారు. సాక్షి నేమ్ బోర్డ్స్ ని ధ్వంసం చేశారు. కంటిన్యూస్‌గా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు.. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నడిచింది. సో ఈ కార్యక్రమం నడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీలు సాక్షి కార్యక్రమంలో మాట్లాడిన ఒక వ్యక్తి వ్యాఖ్యలు మొత్తం ఆ సంస్థ ఆర్గనైజ్డ్‌గా కావాలని చేసింది.. ఆ సంస్థని మూసేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. ఆ సంస్థ కావాలని అమరావతి మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయించింది అంటూ మొత్తం ఆంధ్రప్రదేష్‌కి సంబంధించిన రాజకీయ పార్టీలు అన్నీ మాట్లాడాయి. మాట్లాడడం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి కార్యాలయాలపైన దాడులు జరిగితే ఖండించిన పాపాన పోలేదు..నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ఏ పౌరుడి హక్కు.. ఏ పౌరుడికి సంబంధించిన ఆస్తికైనా నష్టం కలిగినప్పుడు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఓ పత్రిక కార్యాలయాలపైన వరసగా దాడులు జరుగుతుంటే ప్రభుత్వంలోని పెద్దలు ఎవ్వరూ ఖండించిన పాపాన పోలేదు కదా.. అటువంటి దాడులు చేయడానికి వచ్చిన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడులు చేయడం చూశాం. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story