Journalist YNR Analysis : రేవంత్‌రెడ్డిని సీఎం చేసి తప్పు చేశాం.. సౌత్ ఫస్ట్ సంచలనం..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపైన ఏఐసిసి అసంతృప్తిగా ఉందా, ఏఐసిసి నాయకత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన ఆశలు వదిలేసుకున్నారా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపైన ఏఐసిసి అసంతృప్తిగా ఉందా, ఏఐసిసి నాయకత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన ఆశలు వదిలేసుకున్నారా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు అనుకుంటున్నారా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేనే స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు అని వ్యాఖ్యానించినట్లుగా సౌత్ ఫస్ట్ అనే వెబ్‌సైఐట్ ఒక కథనాన్ని రాసింది. ఆ కథనాన్ని ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధానంగా పరిచరించింది. ఏముంది ఆ కథనంలో, ఇటీవల కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ నాయకులు, తెలంగాణ ఎమ్మెల్యేలు మల్లికార్జున్ ఖర్గేని కలిసేందుకు వెళ్ళారు. ఆయన అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో బెంగళూరుకి వెళ్లి ఆయనను కలిసి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్ళారు, అలా విడతలవారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన పరామర్శ కోసం బెంగళూరుకి వెళ్తూఉన్నారు. అలా ఇటీవల తెలంగాణలో ప్రభుత్వంపైన, తెలంగాణలో కొంతమంది మంత్రులపైన, బాహాటంగా విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యేల ద్వయం కొంతమంది తెలంగాణకు సంబంధించిన మంత్రులకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు వేసిన ఎమ్మెల్యేల బృందం మల్లికార్జున్ ఖర్గేని కలిసింది. మల్లికార్జున్ ఖర్గేని కలిసి తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు సంబంధించిన అవినీతిపైన, ప్రభుత్వం పనితీరుపైన కంప్లైంట్ చేసినట్లుగా ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్లుగా సౌత్ ఫస్ట్ చెప్తోంది. అంతేకాదు ఇక్కడ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చింది, ఆ ఆరు గ్యారెంటీలకు సోనియా గాంధీతో హామీ ఇప్పించి, ఆమెని తీసుకొచ్చి ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేసింది, కానీ ఆ గ్యారెంటీల్ని అమలు చేయలేకపోతుంది, అమలు చేయలేని కారణంగా తెలంగాణలో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అనే విషయాన్ని కూడా ఎమ్మెల్యేలు పార్టీ అగ్రనేత మల్లికార్జున్ ఖర్గే దృష్టికి తీసుకెళ్ళినట్లుగా సమాచారం ఉంది. మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ రాజకీయాలకు కొత్త వ్యక్తిగా చూడలేము, ఆయన నైబర్ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి, కర్ణాటక బీదర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణకు సంబంధించిన పరిపాలన, ప్రభుత్వం పాలన ఎలా ఉంది, అనేది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, అనేకమంది తెలంగాణకు సంబంధించిన ముఖ్య నాయకులకు కూడా, ఖర్గేతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్గే తనకు తన దగ్గర ఉన్న సోర్సుని కూడా, తన దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా ఆ ఎమ్మెల్యేలతో పంచుకున్నట్లుగా ఈ సౌత్ ఫస్ట్ కథనం రాసింది. ఏమని పంచుకున్నారు, 10 ఏళ్ళు గ్యారెంటీగా అధికారంలో ఉంటామనుకున్నాం, 10ఏళ్ళు పవర్ లో ఉంటుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం కానీ, రెండేళ్లలోనే కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణంఅని ఆయన వ్యాఖ్యానించినట్లుగా కథనం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంలో పలుచన అయిపోయాం, అటు బీసీల్లోనూ పరపతి రాలేదు, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అనాదిగా అండగా ఉంటూ వస్తున్న రెండు ప్రధాన సామాజిక వర్గాలు కూడా, కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో ఏమాత్రం అవగాహన లేకుండా, ప్లానింగ్ లేకుండా రేవంత రెడ్డి ముందుకు వెళ్ళారు, రాహుల్ గాంధీని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేశారు, ఆ రకంగా పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడా నష్టం చేసినట్లయింది అని ఖర్గే వ్యాఖ్యానించారట. అంత మాత్రమే కాదు తెలంగాణలో 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని కూడా అమలు చేయకపోవడం అనేది కూడా నేరుగా సోనియా గాంధీయే మాట తప్పింది, సోనియా గాంధీ మాట ఇచ్చి తెలంగాణ ప్రజలని మోసం చేసింది, ఇలాంటి ఒక ఇంప్రెషన్ ని కల్పించింది. ఈ హామీలు ఇస్తున్న సందర్భంగా తెలంగాణకు సంబంధించిన ఎకానమీపైన, బడ్జెట్ పైన నాలెడ్జ్ లేకుండా హామీలు ఇచ్చేసి, వాటికి టైం బాండ్ పెట్టి అందరితో హామీలు ఇప్పించేసి, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా, చేతులు ఎత్తే,సి పార్టీని పూర్తిగా వెనక్కి నెట్టేశారు. పార్టీకి నష్టం చేశారు అనేది ఖర్గే అభిప్రాయంగా ఉంది.
రేవంత్ రెడ్డి సెలెక్షన్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సెలెక్షనే రాంగ్ సెలెక్షన్‌గా ఖర్గే ఈ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. సౌత్ ఫస్ట్ ప్రచురించింది, ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డిని మేము రాంగ్‌గా సెలెక్ట్ చేశాం, రేవంత్ రెడ్డిని సెలెక్ట్ చేయడం కారణంగా, రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కారణంగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా నష్టపోతుంది, వచ్చే ఎన్నికలో ఎట్టి పరిస్థితిలో మనం గెలిచే అవకాశమే లేదు, ఎట్టి పరిస్థితిలో మనం గెలిచే పరిస్థితే లేదు అని సౌత్ ఫస్ట్ కథను రాసినట్లుగా, నమస్తే తెలంగాణ ప్రచురించింది. సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మంత్రుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమ ఉందా అంటే ఆఫ్ ది రికార్డ్ ఏ పార్టీ ఏ నాయకుడు కూడా గ్యారెంటీగా మళ్ళీ మేము గెలుస్తామని చెప్పే పరిస్థితిలో 100% లేదు. సౌత్ ఫస్ట్ చెప్తుంది కాబట్టి, కాదు మన అబ్జర్వేషన్ మనం చెప్తుంది, మళ్ళీ అధికారంలోకి వస్తామనే గ్యారెంటీ, ధీమ తెలంగాణకు సంబంధించిన మంత్రుల్లో కనపడట్లేదు. ఎమ్మెల్యేల్లో కనపడట్లేదు. ఆఫ్ ది రికార్డ్ ప్రైవేట్ సంభాషణలో అందరూ చెప్తున్నారు, గవర్నమెంట్ మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు, రేపు పొద్దున్న రాజఎవరో, రెడ్డి ఎవరో, ఇప్పుడేదో ఇల్లు చక్కపెట్టుకుందాం అనే మూడ్‌లోకి పార్టీ నాయకత్వం వెళ్ళినట్టు కనపడుతుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
