మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి కూటమి సర్కారు ఎందుకంత పట్టుదలగా ఉంది అనేది అర్థం కావట్లేదు.

మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి కూటమి సర్కారు ఎందుకంత పట్టుదలగా ఉంది అనేది అర్థం కావట్లేదు. కూటమి సర్కారు పట్టుదల చూస్తే ప్రజలకి కూడా అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి సర్కారు ఎందుకు ఇంత మొండి పట్టు పడుతోంది, ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం చేస్తున్నారు. అక్కడ అప్పులు తీసుకొస్తున్నారు, నిర్మాణాలు చేస్తున్నారు, ఎవరైనా అభ్యంతర పెట్టినా ప్రజలు పెద్దగా దాన్ని పట్టించుకోరు, అమరావతి నిర్మాణం చేస్తామని చెప్పి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అమరావతి నిర్మాణాన్ని చేస్తుంది. ఎవరైనా అభ్యంతరాలు పెట్టినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మెడికల్ కాలేజీలో సీట్ల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఇస్తున్నారు. అసలు మొత్తం మెడికల్ రంగంమంతా ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాల్సిన అవసరం ఉంది. నేను చిన్నప్పుడు ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళేవాడిని కాదు, నాకు ఏదైనా చిన్న అనారోగ్యం జరిగితే హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి చూయించుకునేవాడిని అంటూ చెప్పిన నారా లోకేష్, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ప్రస్తావనే తీసుకురాని చంద్రబాబు నాయుడు, మెడికల్ కాలేజీల ప్రస్తావన, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంలో గత వైసీపీ సర్కారు తప్పులు చేస్తుంది అని చెప్పిన పవన్ కళ్యాణ్, వీళ్ళంతా కలిసి గంపగుత్తగా మొత్తం మెడికల్ కాలేజీల్ని వచ్చే 50 60 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తుంటే, దీని వెనక రీజన్ ఏంటో ప్రజలకు అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది, అంత అమాయకంగా ఎవరున్నారు, దీని వెనక రీజన్ ఎవరికో కొంతమందికి లబ్ది చేకూర్చడం తప్ప రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కాదు. ఈ అంశం పైన రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది, ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది, ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉంది, మూడు సార్లు టెండర్ల డేట్ సవరించిన తర్వాత కూడా మెడికల్ కాలేజీలకు టెండర్లు వేయడానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ముందుకు రాలేదు.

ఈ రంగంలో అనుభవం ఉన్న ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చి టెండర్లు వేయలేదు అంటే, ఇది ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు కాబట్టి, మేము వస్తే రద్దు చేస్తాం అన్నాడు కాబట్టి, టెండర్ వేయడానికి ఎవరు ముందుకు రాలేదుంటూ మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. ఇది కూడా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే కదా, మీరు అధికారంలో ఉన్నారు 15 ఏళ్ల అధికారంలో ఉంటామని చెప్తున్నారు, అయినప్పటికీ, మీ మాట నమ్మకుండా మేము వస్తే రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని ప్రజలు నమ్ముతున్నారంటే, పెద్ద పెద్ద సంస్థలు నమ్ముతున్నాయ అంటే, మిమ్మల్ని జనం నమ్మట్లేదు, మీరు తీసుకుంటున్న నిర్ణయం మూడేళ్ల తర్వాత రద్దవుతుంది అని, మెడికల్ రంగంలో, మెడికల్ కాలేజీలు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నట్లు అర్థం కదా. అలా కాదు జగన్మోహన్ రెడ్డి బెదిరింపులతో సంబంధం లేదు, అనుకుంటే మరి ఎవరు ఆసక్తి చూపడం చూపకపోవడం వెనక రీజన్ ఏంటి? మూడు సార్లు టెండర్ల డేటు సవరించిన తర్వాత కూడా ఒక్కరు కూడా టెండర్ ఎందుకు వేయలేదు. ఇంకా వాళ్ళకి అపార లబ్ది చేకూర్చి, మీరు రండిరా బాబు అని బతిమాలి, వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇచ్చి ఇంకా ఏమన్నా ఇన్సెంటివ్స్ కావాలంటే ఇచ్చి, మీరు కాలేజీలు నడిపినంత కాలం అందరికీ జీతాలు మేమే ఇస్తామని చెప్పి, ఇంకేం చేసి ఇంకేం చేసో ఇంకా ఎక్కువ చవకకు, ఇంకా తక్కువ ధరకు, ఇంకా ప్రజల ధనాన్ని ఆ ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెట్టడం కోసం ఏమన్నా కొత్త ప్రణాళిక వేస్తున్నారేమో అర్థం కావట్లేదు. మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కూటమి సర్కారు తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుంది. కూటమి సర్కారు పైన ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన వ్యతిరేకత రావడానికి కారణమైన ప్రధానమైన అంశాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కూడా ఒకటి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మాకు మోదీ మద్దతు ఇచ్చారు, నడ్డా మద్దతు ఇచ్చారు అంటూ ఒక కొత్త ప్రచారానికి తెరలేపారు. మోదీ మద్దతు ఇచ్చినా, నడ్డా మద్దతు ఇచ్చినా ఇంకెవరు మీ వెనక నిలిచినా మీ తెలుగుదేశం పార్టీ కూడా మీ వెనక ఉండదు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం పెట్టి రహస్యంగా ఒక్కొక్కరిని అడగండి. మెడికల్ కాలేజీల అంశం పైన ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు చెప్తారు.సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story