Medical Colleges: ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేస్తున్న ఆ రెండు పత్రికలు..!

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది. ప్రభుత్వం ఎదురుదాడి చేయడం విషయం పక్కన పెడితే. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రధానమైన మీడియా తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వంతపాడడం ద్వారా, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకు అప్ప చెప్పడాన్ని ఒక అద్భుతమైన కార్యక్రమంగా, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రెండు ప్రధానమైన పత్రికలు తెలుగు జాతికి ద్రోహం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలో ఏడు మెడికల్ కాలేజీలని గత సర్కారు పూర్తి చేసింది, ప్రభుత్వపరంగా మిగిలిన 10 మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ లో దీనికి సంబంధించిన ఆమోదాన్ని పొందింది, 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాబోతున్నాయి, దీన్ని కాస్త కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా, కాస్త ప్రజల కోణంలో ఆలోచించే వాళ్ళు ఎవరైనా, తప్పుగానే చూస్తారు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీని మోస్తున్న పత్రికలు తప్ప గతంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించిన వాళ్ళు, గతంలో ప్రైవేట్ వాళ్ళకు మొత్తం అంతా రాష్ట్ర సంపదని దోచేస్తున్నారని గగ్గోలు పెట్టిన వాళ్ళు, ఇప్పుడు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని ఏ రకంగా సమర్ధిస్తున్నారో చూస్తున్నాం. ఇలా సమర్ధించడం ద్వారా జాతికి వాళ్ళు చేస్తున్న ద్రోహం ఏంటో కళ్ళ ముందు కనబడుతుంది, ఆంధ్రప్రదేశే కాదు ఎక్కడైనా, ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది డెవలప్డ్ సొసైటీ కావాలంటే, విద్యా వైద్యం నాణ్యతతో కూడినవిగా ఉండాలి, విద్యా వైద్యం అందిస్తే చాలు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు ఏమి అవసరం లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిన, మాట్లాడుతున్న మేధావులు చెప్తున్న మాటల్ని కూడా చాలా సందర్భాల్లో విన్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య ఏ రకంగా ప్రైవేట్ పరం అయిందో చూస్తున్నాం, గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడాన్ని గమనిస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్ళండి అంటూ ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్న తీరు చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రైవేట్ విద్యా సంస్థలని నడిపిస్తున్న వాళ్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తూ ఉండడం చూస్తున్నాం. విద్యని చాలా సక్సెస్‌ ఫుల్‌గా ప్రజల నుంచి దూరం చేశారు. ప్రజలకు విద్యని ప్రభుత్వ పరంగా కాకుండా, ప్రైవేట్ పరంగానే క్వాలిటీతో కూడిన విద్య అందుతుంది అంటూ నేరుగా ముఖ్యమంత్రి ప్రమోట్ చేయడం చూస్తున్నాం, ఇక తాజాగా వైద్యం సంగతి చూస్తే, వైద్యం కూడా పేదలకు ప్రభుత్వపరంగా కాకుండా, ప్రైవేట్ వాళ్ళ దగ్గరే కొనుక్కునే పరిస్థితిని ప్రభుత్వమే తీసుకొస్తుంది. సో విద్యని వైద్య వైద్యాన్ని ప్రభుత్వమే ప్రజలకు దూరం చేసే కుట్ర చేస్తుంది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

ehatv

ehatv

Next Story