Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్-మీనాక్షి రిపేర్స్..!
కాంగ్రెస్ సర్కారు వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచినప్పటికీ కాంగ్రెస్ సర్కారు చేసిన మంచి పనులను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్ళలేకపోయామనే ఒక అసంతృప్తి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి ఉందో లేదో కానీ కేంద్ర నాయకత్వానికి ఉంది. కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ సర్కారు చేసిన మంచిని ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటూ ఆవేదన చెందుతోంది. సో ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల కంటే ఎక్కువ కొట్లాటలకు దిగుతున్నారు, ఒకరి పైరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు, ఒకరికి సంబంధించిన లోతులు, లొసుగులు ఇంకొకరు ఢిల్లీకి మోసే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఇది అధిష్టానానికి చిరాకు తెప్పించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ రిపేర్ కోసం మీనాక్షి నటరాజ్‌ను ఇక్కడికి పంపించారు, మీనాక్షి నటరాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షుడిని కూడా ఆల్మోస్ట్ పక్కన పెట్టేసి సొంతంగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో ఒక పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అక్కడ పార్టీకి సంబంధించిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న మహిళ, నేరుగా పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేకుండా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి నాయకుల దగ్గర నుంచి సమాచారం తీసుకోవడం ఎంత కష్టమో ఆమెకై అవగతమైంది. ఆ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్‌తో, ముఖ్యమంత్రితో కలిసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్న క్రమంలో కూడా పార్టీని రిపేర్ చేయడానికి సంబంధించిన ఆలోచనల్ని చాలా సీరియస్‌గా చేస్తూ వస్తున్నారు. ఈ మేరకు ఆమెకు ఇలాంటి రిపేర్లు చేయడానికి సంబంధించి రాహుల్ గాంధీ దగ్గర నుంచి కూడా మద్దతు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి ప్రజల దగ్గరికి వెళ్తారు లాంటి వార్తలు దాదాపు ఆరుఏడు నెలలుగా చూస్తున్నాం, ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసావ్ అనేది నేను ప్రజల దగ్గరికి వెళ్లి చెప్తానంటూ చెప్తూ వస్తున్నారు, బట్ ఇప్పటివరకు వెళ్లారా, ఈవెన్ మంత్రులు ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు, వాళ్ళు ఎక్కువగా నియోజక వర్గాలు, లేకపోతే హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు స్థాయిలో ఉన్న గొడవల్ని, నాయకుల మధ్య విభేదాలని సర్దుబాటు చేయడానికే సరిపోతుంది తప్ప పీసీసీ అధ్యక్షుడు కూడా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని చెప్పలేకపోతున్నారు, ఈ నేపథ్యంలో నేరుగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ పాదయాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మొదటి విడతగా ఆమె కొన్ని నియోజక వర్గాల్లో ఆ పాదయాత్ర చేయబోతున్నారు, ఈ నెల 31 నుంచి పాదయాత్రలు ప్రారంభం కాబోతున్నాయి, పాదయాత్రలో ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నిటిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గనుక పార్టీ పరాజయం పాలైతే, పార్టీ మెరుగైన ఫలితాలను సాధించకపోతే, సో పార్టీ పైన పార్టీ పట్ల ప్రజల్లో మరింత నెగిటివ్ ప్రచారం ఎక్కువగా జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి స్థానిక ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ప్రభుత్వానికి సంబంధించిన, ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడంతో పాటు వాళ్ళు చెప్పే సమస్యలు ఏంటో వినడం ద్వారా. వాళ్ళ సమస్యలని ఒకసారి వినడం ద్వారా సో వీళ్ళకి చెప్పాము అధికారంలో ఉన్నారు కాబట్టి పరిష్కారం చేస్తారేమో అని ఒక హోప్ ని ప్రజలక ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఆలోచన ఆమె చేస్తుంది. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..