Mega Parent Teacher Meeting : పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో టీడీపీ..!
ఆంధ్రప్రదేష్‌లో ప్రభుత్వం చాలా గొప్పగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేష్‌లో ప్రభుత్వం చాలా గొప్పగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో పేరెంట్స్ తెలుసుకునే అవకాశం కల్పించడం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం సరైనదే, ఆహ్వానిద్దాం, డెఫినెట్ గా అదిఒక మంచి ఇనిషియేషన్ గా చూద్దాం. ఇది రెండో పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిన్న జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులు పార్టిసిపేట్ చేశారు. ముఖ్యమంత్రి మంత్రులు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడం ఓకే దాన్నే యక్సెప్ట్ చేద్దాం. ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు ఆ మీటింగ్ నిర్వహించి అక్కడ విద్యార్థుల దగ్గరికి వెళ్లి విద్యార్థులకు సంబంధించిన సమస్యలు లేకపోతే పేరెంట్స్ ఒపీనియన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం కూడా తప్పేం కాదు. ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగబోతుంది, పార్టీ నాయకులంతా పాల్గొనండంటూ తెలుగుదేశం పార్టీ అధినేత పార్టీ కార్యాలయం నుంచి ఒక పిలుపునిచ్చారు.
పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధం ఏంటి, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టిసిపేట్ చేయడం ఏంటి, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఇనిషియేషన్ కార్యక్రమం జరుగుతుంటే, దానిలోకి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా వెళ్లి కూర్చొని పార్టిసిపేట్ చేయండి అని ముఖ్యమంత్రి నేరుగా పిలుపునివ్వడం, నిన్న జరిగిన మీటింగ్లో అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, కొన్ని చోట్ల జెండాలు, మెడలో జెండాలు కూడా వేసుకొని వెళ్లి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చూస్తే, ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు తేడా లేకుండా చేస్తోంది కూటమి సర్కారు అనే విషయం స్పష్టమవుతుంది. ఇది మంచిది కాదు, విద్యాలయాల్లో మీ రాజకీయ పార్టీలు, మీ జెండాలు, మీ నాయకులు అవసరం ఉందా. పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో ఎవరు ఉండాలి, ఉంటే పేరెంట్స్ ఉండాలి, టీచర్స్ ఉండాలి, స్టూడెంట్స్ ఉండాలి, విద్యా కమిటీలో కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా పర్వాలే, ఇది కాకుండా రాజకీయ పార్టీలకి ఏంటి సంబంధం. ఏం చెప్తారు వాళ్ళు, అక్కడికి వచ్చి ఏ రకమైన సంబంధం ఉంటుంది, వాళ్ళకి అక్కడ ఎందుకు వాళ్ళు రావాలి, మీటింగ్ కి ఏం చెప్పాలి అక్కడికి వచ్చి మా పిల్లోడు సరిగ్గా చదువుతున్నాడా లేడా అనేది ఆ పేరెంట్ టీచర్ ని అడుగుతారు, ఆ పిల్లోడి పరిస్థితి ఏంటనేది టీచర్ పేరెంట్ కి చెప్తారు. ఇది కాకుండా స్కూల్ నిర్వహణకి సంబంధించిన ఇష్యూ ఏమన్నా ఉంటే విద్యా కమిటీ చూసుకుంటుంది. మధ్యలో రాజకీయ పార్టీలకి ఏంటి సంబంధం. పైగా ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పార్టిసిపేట్ చేయమని ఎలా పిలుపునిస్తారు, అంటే ప్రతి కార్యక్రమంలో పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుందాం, స్కూల్లోకి జెండాలు వేసుకొని వెళ్దాం, స్కూల్లోకి కండువాలు వేసుకొని వెళ్దాం అని ప్రభుత్వం భావిస్తుందా? దీనిపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


