ఆంధ్రప్రదేష్‌లో ఎన్నికలకు ముందు కూటమి, కూటమి కంటే కూడా తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పాటు కావడం కంటే ముందే మహానాడులో సూపర్ సిక్స్ అంటూ ఒక ఎజెండాని తీసుకొచ్చింది.

ఆంధ్రప్రదేష్‌లో ఎన్నికలకు ముందు కూటమి, కూటమి కంటే కూడా తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పాటు కావడం కంటే ముందే మహానాడులో సూపర్ సిక్స్ అంటూ ఒక ఎజెండాని తీసుకొచ్చింది. ఒక స్లోగన్ తీసుకొచ్చింది. సూపర్ సిక్స్ అమలు చేయబోతున్నాం అంటూ చెప్పింది. సూపర్ సిక్స్ ఎందుకు తీసుకొచ్చింది అంటే ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కూడా మహిళలకు సిలిండర్లు ఇస్తామని చెప్పి. కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డ నిధి పేరుతో 1500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పి. కాంగ్రెస్ పార్టీ అలాగే మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. దీనికి కారణం ఈ పాపులర్ హామీలతో కాబట్టి, అవే హామీలను మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేస్తామని చెబుదాం అలా అధికారంలోకి వద్దాం అంటూ, అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని, కాపీ పేస్ట్ చేసి సూపర్ సిక్స్ ని తయారు చేసింది తెలుగు దేశం పార్టీ. ఈ మాట చెప్పడానికి నేనేం ఎజిటేట్ చేయట్లేదు, కాపీ పేస్టే సిలిండర్ల పథకం కావచ్చు. బస్సులకు సంబంధించిన పథకం కావచ్చు. ఆడబిడ్డ నిధి కావచ్చు, ఇవి ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల హామీలు వాటినే, యస్ ఇట్ ఈజ్‌గా ఆంధ్రప్రదేష్‌లో తెలుగుదేశం పార్టీ అమలు చేయాలనుకుంది. సూపర్ సిక్స్ పేరుతో ప్రజల దగ్గరికి వచ్చింది. ఈ సందర్భంగా ఆ హామీల అమలుకు సంబంధించి పడుతున్న ఇబ్బందులు ఆపసోపాలు చూస్తూన్నాం. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పటికీ అర్థం కాని ఒక విషయం ఏడాది కాలంలో లక్ష 60వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన ఓ రాష్ట్ర ప్రభుత్వం, పథకాలను మాత్రం అమలు చేయలేకపోతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచే మేము వాటిని అమలు చేస్తామని చెప్పి, సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు అమలు కానీ, మొదలు కాని పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఎందుకు చేయలేకపోతుంది గతంలో ఉన్న పథకాలను కూడా కొన్ని ఆపేసింది, ఎందుకు గతంలో ఏడాదికి ఆనాన్ యవరేజ్ 70-80 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన సర్కారేమో హామీలన్నీ అమలు చేసింది. బట్ డబుల్ అప్పు చేసిన సర్కార్ మాత్రం గతంలో ఉన్న హామీలు కూడా ఎందుకు అమలు చేయట్లేదు లాంటి చర్చ క్షేత్ర స్థాయిలో ప్రారంభమైంది. దీని నుంచి తప్పించుకోవడం కోసం రకరకాల డైవర్షన్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్న తాజా పరిణామాలు చూస్తే మీకు అర్థమవుతుంది. తాజాగా ఇక ఓపెన్ గానే మేము ఇవ్వలేము అనే ఒక ఎజెండాని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. పొలిటికల్ డెవలప్మెంట్స్, పొలిటికల్ డైవర్షన్ స్కీమ్స్ ఒక పక్క నడుస్తూ ఉండగానే, ప్రజల్ని మెంటల్ గా ప్రిపేర్ చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు కనపడుతుంది. ఈ పార్టీకి సంబంధించిన రాష్ట్ర శాఖ మాజీ మాజీ అధ్యక్షుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్ నాయుడు నిన్నటి స్టేట్మెంట్ చూసిన తర్వాత ప్రభుత్వం ఇక చేతులు ఎత్తేస్తోంది. సూపర్ సిక్స్ అమలుకు సంబంధించి అనే విషయం అర్థమవుతుంది.ఈ అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
