కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఒక షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడుతూ వస్తున్న మాట బనకచచర్ల ప్రాజెక్టుకు సంబంధించి.

కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఒక షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడుతూ వస్తున్న మాట బనకచచర్ల ప్రాజెక్టుకు సంబంధించి.. బనకచచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి.. 82వేల కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. 60 వేల కోట్ల రూపాయల సాయం కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది అంటూ నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌కు సంబంధించిన వాళ్లు.. సో బనకచర్లలో ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అంటూ చెప్తూ వచ్చారు. గోదావరి జలాలను తుంగభద్ర బేసిన్ వరకు తీసుకెళ్లబోతున్నాం.. ఆంధ్రప్రదేశ్‌లో ఇక సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని చెప్తూ వచ్చారు. నిజంగా అసలు ఇది సాధ్యమయ్యే ప్రాజెక్టనా అంటే చాలా మంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ముందు నుంచి చెప్తూ వచ్చిన మాట సాధ్యమయ్యేది కాదు అని.. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కొంతమంది బుద్ధిజీవులు మాట్లాడుతూ వస్తున్న మాట ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితిలో బనకచచర్ల లాంటి ఒక ప్రాజెక్ట్ ని టేకోవర్‌ చేయడం అనేది సాధ్యం కాదు.. అది టేక్అప్ చేయకుండా ఉంటేనే బెటర్ అంటూ మాట్లాడుతూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 3000 టీఎంసీలకుపైగా గోదావరి జిలాలు వృధాగా పోతున్నాయి, ఒక 200 టీఎంసిలు నీరు మేము వాడుకుంటాం పోలవరం నుంచి పోలాపల్లి రిజర్వాయర్, బనకచర్ల వరకు ఆ నీటిని తీసుకెళ్తాం కాబట్టి అనుమతి ఇవ్వండి, కేంద్రం డబ్బులు కూడా ఇవ్వండి అంటూ చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపాదన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్రతిపాదనపైన తెలంగాణ నుంచి తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమైంది.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అభ్యంతరం చెప్పింది.. తెలంగాణకు సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా దీనిపైన అభ్యంతరం చెప్తూ వచ్చాయి.

సో ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాల్సిందే అంటూ కోరుతూ వచ్చాయి. రెండు రాష్ట్రాల విభజన జరిగిన సందర్భంగా అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయించిన తర్వాత, అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించిన తర్వాత మాత్రమే రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కొత్త ప్రాజెక్టు చేపట్టినప్పటికీ అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించాలి అని ఒక నిబంధన ఉంది. అపెక్స్ కౌన్సిల్ లో రెండు రాష్ట్రాల్లో లైక్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటారు ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సో అలా కాకుండా పక్క రాష్ట్రంతో కనీసం చర్చించకుండా ఎపెక్స్ కౌన్సిల్ లో పెట్టకుండా ఏ రకంగా బనకచచర్ల ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేపడుతుంది అనేది తెలంగాణ రైజ్ చేస్తున్న అభ్యంతరం దాంతో పాటు తెలంగాణకు సంబంధించిన నికర జలాలు వాడుకోవడం పైన ఇంకా పూర్తిగా మేము దృష్టి పెట్టలేదు వరద జలాల్లో కూడా మాకు వాటా ఉంటుంది అటువంటప్పుడు వరద జలాలను బేస్ చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ని ఏ రకంగా కడతారు అనే అభ్యంతరాన్ని కూడా తెలంగాణ రైజ్ చేస్తూ వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులో దాన్ని మేము సాధిస్తాం, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి.. ఎన్డీఏ సర్కారు మాకు సహాయం చేస్తుంది అంటూ భావిస్తూ వచ్చిన చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ని ఇచ్చింది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


ehatv

ehatv

Next Story