Nara Lokesh : పెట్టుబడులూ..అప్పుల లాంటివేనా ?
ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటన చేస్తున్నారు.

ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటన చేస్తున్నారు. పర్యటన చేస్తున్న సందర్భంగా అక్కడ ఎన్ఆర్ఐలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతూ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్స్ లో ఆయన ప్రసంగిస్తున్నారు, అమెరికా పర్యటనలో నారా లోకేష్ మాట్లాడిన మాటలు ఇవి అంటూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రధానంగా ప్రచురిస్తూ వస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధాన మీడియాలో ఈరోజు వచ్చిన వార్త ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు గడిచిన 17 నెలల్లోనే 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అనేది నారా లోకేష్ ఎన్ఆర్ఐలకు చెప్పిన మాట. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మేము కేవలం 17 నెలల్లో సాధించాం. మరొక రెండు, మూడు నెలల్లోనే వీటన్నిటిని గ్రౌండ్ చేయబోతున్నాం. 20 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నాం అంటూ నారా లోకేష్ అక్కడ చెప్పారు. గడిచిన ఎన్నికల కంటే ముందు ఆంధ్రప్రదేష్‌లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామి 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. బట్ 17 నెలల్లోనే 20 లక్షల మందికి ఉపాధి వచ్చేసింది అనేది నారా లోకేష్ అమెరికాలో చెప్తున్న మాట. ఒక రెండు, మూడు నెలల్లో అన్నీ గ్రౌండ్ అయిపోతాయి. 20 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనేది ఆయన చెప్తున్న మాట. ఓ ప్రభుత్వం ఓ రాష్ట్రం 17 నెలల కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించడం అనేది చ్చితంగా చిన్న విషయం కాదు.
భారతదేశం ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ను పిలిచి ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో పెద్ద సన్మానం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. 20 లక్షల కోట్ల రూపాయలు అంటే ప్రతి నెల లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వస్తున్నాయి అంటే డెఫినెట్ గా చిన్న విషయం కాదు. డెఫినెట్ గా చిన్న విషయం కాదు. అంత గొప్ప అచీవ్మెంట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ సాధించింది అనేది నారా లోకేష్ చెప్తున్న మాట. ఇటీవల విశాఖలో ఏర్పాటు చేసిన సమ్మిట్ సందర్భంగా కావచ్చు, అంతకుముందు నారా లోకేష్ విస్తృతంగా చేసిన పర్యటనల కారణంగా కావచ్చు, ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి అనేది ఆయన చెప్తున్న మాట. దావోస్ పర్యటనకు నారా లోకేష్ ముఖ్యమంత్రి, చంద్రబాబు పరిశ్రమల శాఖ మంత్రి, భారత్ వీళ్ళంతా వెళ్ళారు. కానీ దావోస్ పర్యటనలో ఒక్కటంటే ఒక్క రూపాయికి సంబంధించిన ఎంఓయు కూడా చేసుకోలేదు అనేది అప్పటి కఠోర వాస్తవం. దావోస్ కి వెళ్ళేది ఎంఓయులు చేసుకోవడానికి, కాదు జస్ట్ లైజన్ పెంచుకోవడం కోసం మాత్రమే అనేది అని, అప్పుడు ప్రభుత్వం చెప్పిన మాట కూడా విన్నాం. దావోస్ లో రూపాయి రాలేదు కానీ, 17 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అనేది ప్రభుత్వం చెప్తున్న మాట. ఈ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ ఒకటి ఉంది, ఆ నెంబర్ చెబదాం, ఆ నెంబర్ చెప్పేసి మన మీడియాలో రాయించేసుకుందాం, 20 లక్షలు వచ్చేసాయి, వచ్చేసాయి, అని బంబాటు చేసేద్దాం అనుకుంటే ఉపయోగం లేదు. రాష్ట్రానికైనా, తెలుగుదేశం పార్టీకైనా, ప్రజలకైనా 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ వచ్చాయి.
ఓ శ్వేత పత్రం, ఓ వైట్ పేపర్ ఏ పరిశ్రమ, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబళలు పెడుతుంది, ఏ పరిశ్రమ ఎంతమందికి ఉపాధి కల్పిస్తోంది, ఏ పరిశ్రమ ఎప్పట్లో ఎప్పటిలోగా అలా ల్యాండ్ అవుతుంది, ఏ పరిశ్రమ ఎప్పటిలోపల తమకు సంబంధించిన కార్యక్రమాలని ప్రారంభించబోతుంది. 20 లక్షల మంది ఆయా కంపెనీల్లో పని చేయడానికి కావలసిన స్కిల్డ్ యూత్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసి పెట్టిందా, స్కిల్ యూనివర్సిటీ అన్నారు, నియోజక వర్గానికి, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇంకేదో అన్నారు. అవి ఇప్పటి వరకు ప్రారంభమైనట్లు లేదు. వీళ్ళ కంపెనీలకు కావాల్సిన స్థాయిలో స్కిల్డ్ ఎంప్లాయీస్‌ని, స్కిల్డ్ పర్సన్స్ ని రెడీ చేసి పెట్టిందా ప్రభుత్వం అనేది కూడా ఒక పాయింట్. నారా లోకేష్ పెట్టుబడుల ప్రసంగాలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


