తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి వచ్చారు.

తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి వచ్చారు. మొన్న జాతీయ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, రకరకాల ప్రాంతాల నుంచి ఆయన కోసం తరలి వచ్చారు. కార్యకర్తలు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా లోకేష్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలని వచ్చారు. లోకేష్‌ను కలిసి తమ సమస్య పరిష్కారం కోసం ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి,ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని వచ్చారు. చాలా మంది అనేక సమస్యల పైన ఎంతమంది వచ్చారంటే., దాదాపు ఒకనాలుగున్నరఐదు కిలోమీటర్ల క్యూ ఉంది, లొకేషన్ కలవడానికి వచ్చిన వాళ్ళతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రోడ్డు మీద ఒక నాలుగు-నాలుగున్నర కిలోమీటర్లకు పైగా క్యూ లోకేష్‌ను కలవడానికి వచ్చిన వాళ్ళతో నిండిపోయింది.

ఇది లోకేష్ పట్ల అభిమానానికి, లోకేష్ పట్ల ప్రేమకి నిదర్శనంగా చూసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ప్రభుత్వ పనితీరు కూడా నిదర్శనం. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఎలా పని చేస్తుంది అనేదానికి కూడా ఒక నిదర్శనం. ఓ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని కలవడం కోసం రాష్ట్రంలోనే అనేక ప్రాంతాల నుంచి అంతమంది వేల సంఖ్యలో అక్కడికి వచ్చారంటే, గ్రౌండ్లో ఎక్కడో పని సరిగ్గా జరగట్లే, ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలు కోరుకున్న మేరకు, కింద యంత్రాంగం పని చేయట్లే. యంత్రాంగం పని చేయట్లేదు కాబట్టి నారా లోకేష్ ఊరు తిరిగి మనకు హామీ ఇచ్చారు కదా, ఆయన ఏమైనా చేస్తారేమెనని, కార్యాలయం దాక వచ్చారు. వచ్చిన వాళ్ళు కేవలం కార్యకర్తలు మాత్రమే కాదు సాధారణ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా హడావుడిగా ప్రకటన చేసింది. చాలా గంభీరంగా ప్రకటన చేసింది ప్రతిరోజు మంత్రులు ఎవరో ఒక మంత్రి, పార్టీ కేంద్రాల కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.

ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. వారానికి ఒక రోజు , రెండు రోజులో జిల్లా మంత్రులు, జిల్లా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఇలా రకరకాల షెడ్యూల్ మరి వేసి, ఏ మంత్రి ఎప్పుడు ఎక్కడ ఉంటారో, కూడా రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పార్టీ కార్యాలయానికి వస్తారు. ప్రజా దర్బార్‌లో పార్టిసిపేట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఏదో నాలుగు రోజులు మొదలుపెట్టి వదిలేశారు, కానీ నారా లోకేష్ మాత్రం కంటిన్యూస్ గా ఆయన నియోజక వర్గానికి సంబంధించిన ప్రజల్ని కలుస్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో ఇటీవల పార్టీ కార్యాలయానికి టీడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళిన సందర్భంగా, దీనిపైన రివ్యూ చేస్తున్న సందర్భంగా పార్టీకి ప్రభుత్వానికి, మధ్య మళ్ళీ గ్యాప్ పెరుగుతోంది పార్టీ కార్యకర్తలని ప్రభుత్వంలో పట్టించుకునే వాళ్ళు లేకుండా పోతున్నారు క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని మనం పరిష్కారం చేయలేకపోతున్నామ, అనే ఫీడ్‌బ్యాక్‌ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ లేదు లేదు, ఇక వారంలో రెండు రోజులు ఒరోజు నేను, ఓరోజు నారా లోకేష్, ఓరోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో ఉంటాం, మీ సమస్యలు ఏంటో తెలుసుకుంటాం మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అని చెప్పారు. చెప్పిన తర్వాత నారా లోకేష్ వస్తున్నారు అనే సమాచారం, పూర్తిగా పెద్ద క్యాంపెయిన్ కూడా కాదు ఆయన వస్తారు, మీ సమస్యలు వింటారు రాష్ట్రవ్యాప్తంగా అందరూ తరలిరండి అని క్యాంపెయిన్ కూడా కాదు, ఆయన వస్తున్నారు అనే సమాచారం తెలుసుకొని ఇన్ని వేల మంది అక్కడికి వచ్చారంటే క్షేత్ర స్థాయిలో ఇంతమందికి సంబంధించిన సమస్యలని వినేవాడు ఎవడు లేడు, వినేవాడు ఎవడు లేడు, ఎమ్మెల్యేలు ఎవరిని పట్టించుకునే పరిస్థితిలో లేరు.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


Updated On
ehatv

ehatv

Next Story