ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ పర్యటనలకు సంబంధించిన అంశం పైన వివాదం చూస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ పర్యటనలకు సంబంధించిన అంశం పైన వివాదం చూస్తున్నాం. వివాదం అంటే ప్రతిపక్ష పార్టీ వివాదం చేస్తోంది. వీళ్ళ ముగ్గురు పర్యటనల కోసం రాష్ట్ర ఖజానా నుంచి భారీగా ఖర్చు పెడుతున్నారు అని, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాక్షి దినపత్రికలో ఆ తరహా వార్తలు రావడం చూస్తున్నాం. వీళ్ళు ముగ్గురు హైదరాబాద్ కి పదే పదే పర్యటనలు చేస్తున్నారు, ఈ 17 నెలల కాలంలో అనేక సందర్భాల్లో హైదరాబాద్ కి వచ్చారు, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు తిరుగుతున్న సందర్భంగా కూడా హెలికాప్టర్లు, విమానాల్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పైన ప్రభావం చూపుతోంది. రాష్ట్రం అప్పుల్లో ఉందని ఒక పక్క చెప్తూ, ఈ స్థాయిలో కోట్ల రూపాయలు వీళ్ళ పర్యటనల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి, పైగా విజయవాడలో ఉండాల్సిన వీళ్ళు, పదే పదే హైదరాబాద్ కి రావడం, హైదరాబాద్ కి వస్తున్న సందర్భంగా, ఫ్లైట్స్ స్పెషల్ ఫ్లైట్స్ వాడడం, వాటికి సంబంధించిన ఖర్చంతా ప్రభుత్వం భరించాల్సి రావడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైనదేనా అలాంటి ప్రశ్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వేస్తూ వస్తున్నారు. దీనికి నిన్న తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కొన్ని ఆధారాలని తనట్ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఏంటి ఆధారాలు అంటే, నారా లోకేష్ గడిచిన 17 నెలల కాలంలో, 77 సార్లు రకరకాల పర్యటనలు చేశారు, అవి వ్యక్తిగత పర్యటనలు అయినా లేకపోతే తన శాఖలకు సంబంధించిన పర్యటనలు అయినా, ఈ పర్యటనలు చేస్తున్న సందర్భంగా వాడిన విమానాలకు సంబంధించిన ఖర్చంతా నారా లోకేష్ భరించారు, నారా లోకేష్ స్వయంగా ఈ ఖర్చును భరించారు, తప్ప ప్రభుత్వం పైన ఈ ఖర్చును వేయలేదు, తన పర్యటనలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కావచ్చు, తాను నిర్వర్తిస్తున్న శాఖల నుంచి కావచ్చు, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అనేది ఆర్టిఐ ద్వారా ఓ కార్యకర్త తీసుకున్న సమాచారం.

ఆర్టీఐకి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాట నారా లోకేష్ పర్యటనలకు సంబంధించి, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయలేదు అని, ఆయన 77 పర్యటనలు చేశారు, ఇందులో అధికారిక పర్యటనలు ఉన్నప్పటికీ, అధికారిక పర్యటనలకు సంబంధించిన ఖర్చును కూడా నారా లోకేషే స్వయంగా పెట్టుకున్నారు తప్ప, ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు. నిజానికి నారా లోకేష్ ని అభినందించాల్సింది పోయి, నారా లోకేష్ కి సన్మానం చేయాల్సింది పోయి, నారా లోకేష్ సూపర్ అనాల్సింది పోయి, లోకేష్ పైన ఈ తరహా వార్తలు ఎలా రాస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్ లో ఒక పోస్ట్ పెట్టారు. నిజమే ఖచ్చితంగా నారా లోకేష్ ని అభినందించాల్సిందే, నారా లోకేష్ సూపర్ అనాల్సిందే, తన వ్యక్తిగత పర్యటనల కోసం కాకుండా, తన శాఖకు సంబంధించిన పర్యటనలు చేసిన సందర్భంలో కూడా, ఆయన విమానాల కోసమో, హెలికాప్టర్ల కోసమో, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వాడకపోవడాన్ని అభినందించి తీరాల్సిందే. పార్టీలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభినందించి తీరాల్సిందే. నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు వృదా చేస్తున్నారు అని రాసిన పత్రికలు కూడా ఆయనకు క్షమాపణ చెప్పాల్సిందే, మేము తప్పు చేశమని ఒప్పుకోవాల్సిందే, డెఫినెట్ గా సేమ్ టైం నారా లోకేష్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు పర్యటనలు చేశారనే పత్రిక రాసింది, నారా లోకేష్ పర్యటనలకు సంబంధించి ఒక రూపాయి కూడా ఆయన శాఖల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఖర్చు పెట్టలేదు అని ఆర్టీఐ ద్వారా సమాచారం బయటికి వచ్చింది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


Updated On
ehatv

ehatv

Next Story