Nellore Penchalaiah Case : గంజాయి హత్య.. పెంచలయ్యను అందుకే చంపేశారా..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేశాం. మేము వచ్చాక గంజాయిని అరికట్టాం, మేము వచ్చాక గంజాయి లేకుండా చేశాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేశాం. మేము వచ్చాక గంజాయిని అరికట్టాం, మేము వచ్చాక గంజాయి లేకుండా చేశాం. గంజాయిని పూర్తిగా నిర్మూలన చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత చేసిన ప్రకటన గంజాయి బ్యాచ్ ని పూర్తిగా అరికట్టామని చెప్పిన మాట. గంజాయి లేకుండా చేసామని చెప్పిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత, 18 నెలల తర్వాత ఆ మాటకు వస్తే ఐదారు నెలలుగా ఆ మాట మాట్లాడుతూ వస్తున్నారు. గంజాయని లేకుండా చేశాం. గంజాయిని నిర్మూలించాం అనే మాట మాట్లాడుతూ వస్తున్నారు, సాక్షాత్తు హోంమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి, సాక్షాత్తు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలంతా ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని లేకుండా చేశామని చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు.
కొద్ది రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాస్, తిరువూరు ఎమ్మెల్యే తిరువూరు నియోజక వర్గంలో పర్టిక్యులర్‌గా గంజాయిని విచ్చలవిడిగా అమ్ముతున్నారు, ఈ గంజాయి అమ్మకం వెనక మా పార్టీకి సంబంధించిన ఎంపీ అనుచరులు ఉన్నారు, అటువంటి అనుచరులని ఎంపీ వెనకేసుకొస్తున్నారు, ఎంపీ అండ చూసుకొని వాళ్ళంతా ఇక్కడ గంజాయి గ్యాంగ్ గా మారిపోయారు, గంజాయిని ఇక్కడ అమ్ముతున్నారని ఆయన చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, ఆయనే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసి, పోలీసులతో కలిసి దాడులు చేయించి, కొంతమందిని అరెస్టులు కూడా చేయించారు. గంజాయికి వ్యతిరేకంగా వీధుల్లోకి వెళ్లి ర్యాలీలు కూడా చేశారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గంజాయి విచ్చలవిడిగా నడుస్తుంది, ఇక్కడ దాన్ని ఆపండి అంటూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేసి, రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేశారు. గంజాయి ఉందా లేదా అనేదానికి సంబంధించి మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు నిదర్శనం కాదా, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే, మీ ప్రభుత్వం పైనే దుమ్మెత్తి పోసేలా, మీ ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చేలా, మీ ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా, లేని గంజాయిని ఉందని ర్యాలీలు చేశారా, లేని గంజాయిని ఉంది అని అమ్ముతున్నారని మాట్లాడారా, ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి, ఆన్సర్ చేయాలి. దానితో పాటు నెల్లూరు జిల్లాలో సిపిఎం నేత పెంచలయ్య హత్య వెనక గంజాయి బ్యాచ్ ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తేల్చారు. కామాక్షి అనే ఒక లేడీ గ్యాంగ్ స్టర్ గంజాయి వ్యాపారం చేస్తోంది, ఆమె గంజాయి వ్యాపారానికి స్థానికంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ నేత పెంచలేయ్య అడ్డంగా ఉన్నారు, ఆయన ఆ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారు, అక్కడ యువతతో కలిసి కొన్ని కమిటీలు వేసి గంజాయికు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మరి గంజాయి లేదనడంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


