బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుంది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపైన ఈ స్థాయిలో వివాదం జరగడం అనేది స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ లేనిది

బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుంది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపైన ఈ స్థాయిలో వివాదం జరగడం అనేది స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ లేనిది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎప్పుడూ ఎదుర్కోనన్ని విమర్శలని, ఎలక్షన్ కమిషన్ ఎదొర్కుంటుంది. మొట్టమొదటిసారి బీహార్ ఎన్నికల సందర్భంగా ఈ దేశంలో ఎన్నికల నిర్వహణపైన అభ్యంతరాలు, అనుమానాలు చాలా సందర్భాల్లో చాలా పార్టీలు వ్యక్తం చేసినప్పటికీ, మొత్తం ఎలక్షన్ కమిషన్ పనితీరుపైన, ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు పైన, ఆధారాలతో సహా ఓ రాజకీయ పార్టీ పోరాటం చేయడం అనేది, బీహార్ ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం. బీహార్‌లో ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలిపైన ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపైన, అక్కడ ఓటర్ల జాబితా సవరణ పైన, అక్కడ ప్రతిపక్షంగా ఉన్న, దేశంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, అనేక రాజకీయ పార్టీలు, అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేకమంది బుద్ధిజీవులు పోరాటం చేస్తూ వస్తున్నారు.

ఇదేంటి ఇంత దారుణంగా ఎందుకు బిహేవ్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అని ఆశ్చర్యపోతూ వస్తున్నారు. ఆశ్చర్యపోతూ కూర్చోకుండా కోర్టులకు వెళ్ళారు, సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు, సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లి, సుప్రీం కోర్టు ద్వారా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పిదాలలో కొన్నింటిని సరిదిద్దారు కూడా. అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఇంకా ఇంకా రహస్యంగానే బిహేవ్ చేస్తుంది, చాలా అంశాలను బయట పెట్టడానికి బీహార్‌లో తొలగించిన ఓటర్ల జాబితాను బయట పెట్టండి అనే అంశానికి సంబంధించి, సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత కూడా ఇప్పటి వరకు క్లియర్ గా వాటిని బయట పెట్టే పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ లేదు అంటే, ఎలక్షన్ కమిషన్ ఎవరికోసం ఇంటెన్షనల్ గా పని చేస్తుందో, అలాంటి ఒక ఒపినియన్ బిల్డ్ అవుతుంది. బీహార్ సమీప దేశమైన బీహార్ భారతదేశంలో ఉన్న రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రంతో ఎక్కువ సరిహద్దు ఉన్న ప్రాంతం నేపాల్, నేపాల్‌ జంజీ పేరుతో జరిగిన తిరుగుబాటుని చూశాం, అక్కడ సోషల్ మీడియా పైన బ్యాన్ విధించడంతో దేశంలో యువత జంజీ పేరుతో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసి, ఆ దేశంలో ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఆ దేశంలో ప్రభుత్వాన్ని అక్కడ యువత పడగొట్టడానికి కారణం కేవలం సోషల్ మీడియా పైన బ్యాన్ పెట్టారు, ఒక రోజు, రెండు రోజులో బ్యాన్ పెట్టారు కాబట్టి, ఇమీడియట్ గా వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టలే, దానికంటే ముందు దానికంటే ముందు ఆ దేశంలో నెపోటిజం పైన, పొలిటికల్ నెపోటిజం పైన దేశ యువతలో విపరీతంగా వ్యతిరేకత వస్తుంది. ఆ దేశాన్ని లీడ్ చేస్తున్న రాజకీయ పార్టీలు నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అక్రమ సంపాదన ,వాళ్ళ అవినీతి, వాళ్ళ జలసాలు, ఇవన్నీ చూసి దేశ యువత రగిలిపోయింది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


ehatv

ehatv

Next Story