తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రోజు వస్తున్న కథనాలు చూస్తున్నాం.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రోజు వస్తున్న కథనాలు చూస్తున్నాం. వరుసుగా వస్తున్న కథనాలు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి, చాలా పెద్ద ఎత్తున వేలాది మంది ప్రముఖులకు సంబంధించిన ఫోన్లని గత బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసింది. ట్యాప్ చేయడం మాత్రమే కాదు, ట్యాప్ చేసి విన్న సమాచారం ఆధారంగా కొంతమందిని బ్లాక్ మెయిల్ చేసింది. బ్లాక్ మెయిల్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళ జీవితాల్ని నాశనం చేసింది, జీవితాల్ని నాశనం చేయడం అంటే భార్యా భర్తలు విడిపోయే స్థాయిలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్‌లోని ప్రముఖులు కుట్రలు చేశారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీలతో పాటు కొంతమంది మీడియా రాస్తూ వస్తున్న వార్తలు ఇవి. సో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి గతంలో ఆరోపణలు చేసిన మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పిన కొంతమంది నాయకులకు సంబంధించి వాళ్ళ నెంబర్లు ట్యాపే కాలేదు అనే విషయం అర్థమైంది. ఇప్పటివరకు సిట్ చేస్తున్న దర్యాప్తును చూస్తే ఎందుకంటే సిట్‌ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎవరెవరి నెంబర్లని అప్పటి సర్కారు ట్యాప్ చేసింది అనే అంశాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించింది. ఆ ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన మీదట ఎవరెవరి నెంబర్లు అయితే అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ కి ఇచ్చిందో ఆ నెంబర్లు కలిగిన ప్రముఖులను పిలిచి విచారణ చేసింది. అలా పిలిచి విచారణ చేసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు బీజేపీకి సంబంధించిన ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి. మరి కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. వాళ్ళని పిలిచి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి వాళ్ళను విచారణ చేసింది, వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంది సిట్. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ద్వారా గత సర్కారు ఏ హీరోయిన్లనైతే వేధించిందని వార్తలు వస్తున్నాయో, రాజకీయ పార్టీలు మాట్లాడాయో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరైతే వ్యాపార ప్రముఖుల్ని గత సర్కారు వేధించిందని ఈ మీడియా రాస్తోందో ఎటువంటి వార్తలైతే వచ్చాయో అవన్నీ కూడా పచ్చి అబద్ధమని సిట్ వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఏ ఒక్కరిని కూడా బయట ప్రధానంగా సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తూ వస్తున్న వార్తలు, సెక్షన్ ఆఫ్ మీడియా ఎవరి ఫోన్లు అయితే ట్యాప్‌ అయ్యాయి అని చెప్తూ వస్తుందో సో వాళ్ళ ఎవ్వరిని కూడా ఇప్పటి వరకు సిట్ విచారణకు పిలవలేదు, విచారణకు ఎందుకు పిలవలేదు అంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ లిస్ట్ లో లేవు, వాళ్ళ ఫోన్ నెంబర్లు టాపింగ్ లిస్ట్ లో లేవు కాబట్టి వాళ్ళని సిట్ ఇప్పటి వరకు విచారణ పిలవలేదు, కొంతమంది జర్నలిస్టులను పిలిచింది, ప్రముఖులని పిలిచింది సర్వేలు చేస్తున్న ఆరా మస్తాన్ లాంటి వాళ్ళని కూడా పిలిచి సిట్ విచారణ చేసింది తప్ప ఈ ఏ హీరోయిన్ని, కానీ ఏ బిజినెస్ పర్సన్ ని గాని పిలిచి ఇప్పటివరకు సిట్ విచారణ చేయలేదు. అంటే సిట్ దగ్గర వాళ్ళ నెంబర్లను గత ప్రభుత్వం టాప్ చేసింది అనే దానికి సంబంధించిన ఆధారాలు లేవు, లేదా గత ప్రభుత్వం అసలు టాప్ చేసింది అనేదానికి సంబంధించిన వాదనే అర్థం లేనిదని అర్థం చేసుకోవాలి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..!


ehatv

ehatv

Next Story