Pavan Kalyan: పవన్ చారిత్రక తప్పిదం

మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేష్‌లో జరుగుతున్న రచ్చ చూస్తున్నాం. ఆంధ్రప్రదేష్‌లో జరుగుతున్న రచ్చ అనేకంటే ఆంధ్రప్రదేష్‌ రగులుతూ ఉంది అని కనపడుతుంది. ఆంధ్రప్రదేష్‌ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని కనపడుతుంది. ఆంధ్రప్రదేష్‌లో విద్యార్థులు ఆంధ్రప్రదేష్‌ బాగుండాలని కోరుకునే వాళ్ళంతా కూటమి సర్కారు కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ప్రైవేటీకరణ అంటే కోపం వస్తుంది తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియాకి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది, ప్రైవేటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే, అది ప్రైవేటే ప్రభుత్వంది కాదు, రేపు పొద్దున హాస్పిటల్స్ అన్నీ ఫంక్షన్ లోకి వచ్చిన తర్వాత, ఆ హాస్పిటల్లో సర్వీసులకి రూపాయి కూడా తీసుకోము, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, అక్కడ వైద్య సేవలు అందుతాయి అని ఏమన్నా ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందా సో అక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఇంకోటో ఉండవు, అక్కడ సీట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండదు, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసి మైనారిటీ విద్యార్థులందరికీ కూడా రిజర్వేషన్ ప్రకారం సీట్లు దక్కుతాయి అని ఏమన్నా కూటం సర్కార్ గ్యారెంటీ ఇవ్వగలదా. లేదు అక్కడ ప్రతి మెడికల్ కాలేజీలోనూ కనీసం 1000 నుంచి 2000 మంది ఉద్యోగులు పని చేసే అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగుల నియామకాలు అన్నింటిలో కూడా రిజర్వేషన్ని పాటిస్తామని భరోస ఏమన్నా ప్రభుత్వం ఇవ్వగలదా, ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తే ఇవేవి దొరికే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ రంగంలో ఉంటే ఓ హాస్పిటల్లో 1000- 2000 ఉద్యోగాలు వస్తే, ఆ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసి మైనారిటీలు అందరికీ కూడా ఉపాధి అవకాశం దొరుకుతాయి. ఆ కాలేజీలోని సీట్లలో రిజర్వేషన్ ప్రకారం వెనకబడిన తరగతుల వర్గాలకు సంబంధించిన పిల్లలందరికీ కూడా సీట్లు వస్తాయి. ఆ మెడికల్ కాలేజీలో వైద్యం తక్కువ ధరకు లేకపోతే ధరే లేకుండా పేదలకు మెరుగైన వైద్యం అందడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దూరం చేయాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ, ఎదురుదాడి చేస్తే ఎలా, మేము ప్రైవేటీకరణ చేయట్లేదని మాట్లాడితే ఎలా, టెక్నికల్ పాయింట్స్ చెప్తే ఎలా, ప్రభుత్వానికి వస్తున్న బాధ ఏంటి, ప్రభుత్వానికి వస్తున్న నష్టం ఏంటి, ఒక్కొక్క మెడికల్ కాలేజీ వర్త్ వేల కోట్ల రూపాయలు. నాలుగుఐదు వేల కోట్ల రూపాయలు వర్త్ చేసే పరిస్థితిలో కూడా వెళ్తాయి, ల్యాండ్ కాస్ట్ కావచ్చు, అక్కడ మెడికల్ సీట్లకు సంబంధించిన అంశం కావచ్చు, అక్కడ వైద్యం తర్వాత ఏం జరగబోతుంది ఏంటి, అనే దానికి సంబంధించి కావచ్చు, వాటన్నిటిని కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచన వెనక కుట్ర కాకపోతే ఏముంటుంది. సో వాటిని ప్రభుత్వం నిర్వహించడానికి కి సంబంధించి పెద్ద బర్డెనే ఏం కనపడట్లే. వచ్చే రెండేళ్లలో మూడేళ్లలో 2000 కోట్లు 3000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం కాలేజీలన్నీ పూర్తి అయిపోయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

ehatv

ehatv

Next Story